Site icon Prime9

Kodali Nani: బావ కోసమే బావమరిది షోకి పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోపై పేర్నినాని కామెంట్స్

perni-nani-comments-on-balakrishna-pawan-kalyan-unstoppable-show

perni-nani-comments-on-balakrishna-pawan-kalyan-unstoppable-show

Kodali Nani: నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కలవడంతో మెగా నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అన్ స్టాపబుల్ షో కోసం వీరిద్దరూ కలిసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి షూటింగ్ లో పాల్గొన్నారు. దీనితో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇకపోతే ఈ షో ఇటు సినీ వర్గాల్లోనే కాకుండా అటు రాజకీయవర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.

బాలయ్య, పవన్ షోకు పలువురు నేతలు పొలిటికల్ యాంగిల్ కు జోడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, మాజీమంత్రి పేర్నినాని అన్ స్టాపబుల్ షోపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ షో ద్వారా బాలకృష్ణకు తన బావ చంద్రబాబును కాపాడే మరో అవకాశం దొరికిందంటూ పేర్నినాని సెటైర్స్ వేశారు. బావ చంద్రబాబు తప్పులను బావమరిది బాలకృష్ణ సరి చేస్తున్నారని పేర్నినాని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ నుంచి ఔరంగజేబులా బాలకృష్ణ కుటుంబానికి అధికారం వచ్చిందని పేర్నినాని పేర్కొన్నారు. చంద్రబాబుకి అనుకూలంగా ఉన్న పార్టీలను బాలయ్య పోగేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసే తిరుగుతున్నారని.. బావతో తిరిగినప్పుడు బావమరిదితో తిరిగితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. ఈ షో వల్ల బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరికీ డబ్బులు వస్తాయన్నారు పేర్నినాని.

pawan-kalyan-unstoppable-show

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా బాలయ్య అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ షోకు టాలీవుడ్ కి చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొని ఇందులో సందడి చేశారు. ఇక ఈ అన్ స్టాపబుల్ షోలో బాలయ్య చేసే సందడితో దేశంలోనే ఈ టాక్ షో టాప్ రేంజ్ కు వెళ్లింది. తాజాగా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ షోకి రావడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది. దీనితో దెబ్బకు థింకింగ్ మారిపోయేలా ఈ షో ని నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లనుంది ఈ ఎపిసోడ్.

ఇదీ చదవండి: టార్గెట్ 2024… “యువగళం” తో నారా లోకేష్ టీడీపీని గద్దె నెక్కిస్తారా ?

Exit mobile version