Pawan Kalyan: పేదల జోలికి వస్తే తోలుతీస్తా.. పవన్ కళ్యాణ్

బాధ్యతలు మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన విలువలు నేర్పిస్తాం. గూండాయిజం, రౌడీయిజం, దోపిడీలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన ఏపీని కచ్చితంగా రక్షించేందుకు బాధ్యత తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో జనవాణి-జనసేన భరోసా రెండో విడత కార్యక్రమం ముగింపు సందర్భంగా పవన్‌

  • Written By:
  • Updated On - July 11, 2022 / 12:13 PM IST

Vijayawada: బాధ్యతలు మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత నేర్పిస్తాం. ఈ ప్రభుత్వానికి తగిన విలువలు నేర్పిస్తాం. గూండాయిజం, రౌడీయిజం, దోపిడీలకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారిన ఏపీని కచ్చితంగా రక్షించేందుకు బాధ్యత తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడలో జనవాణి-జనసేన భరోసా రెండో విడత కార్యక్రమం ముగింపు సందర్భంగా పవన్‌ మీడియాతో మాట్లాడారు.ఇప్పుడు నా వద్దకు వచ్చిన సమస్యలన్నీ ప్రభుత్వం నెరవేర్చాల్సినవే. వారు చొరవ తీసుకోకపోవడంతోనే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇక్కడకు వచ్చారు. మీ ప్రభుత్వం బాగుంటే వరుసగా రెండో ఆదివారం కూడా 400కు పైగా పిటిషన్లు మా వద్దకు ఎందుకొస్తాయి? అంటూ పవన్‌ ప్రశ్నించారు

మాకు లక్ష కోట్ల సంపద లేదు. కోకొల్లలుగా కేసులు లేవు. సిమెంట్‌ ఫ్యాక్టరీలు లేవు. ఒక్కసారి కూడా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టలేదు. మరి ఎందుకు మీరు మమ్మల్ని కౌరవులతో పోలుస్తారు? అని వైసీపీ నేతలను జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు. కౌరవుల లక్షణాలు ఉన్న మీరు మమ్మల్ని అనడం దారుణం. జనసేన పార్టీని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని బింకాలు పలకొద్దు. ఇది మారిన కాలం. జనసేన కోసం జనం ఎదురుచూస్తున్న కాలం. మీరు ఎవరూ మామ్మల్ని ఆపలేరని పవన్ స్పష్టం చేసారు. వెంట్రుక పీకలేరంటూ ప్లీనరీలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై పవన్‌ చమత్కరించారు.కేశ సంపద చాలా విలువైంది. దాన్ని ప్రతిసారి పీక్కోకండి. రాష్ట్ర అభివృద్ధి గురించి, ప్రజల సమస్యల గురించి ప్రజావేదికల్లో మాట్లాడాల్సింది పోయి, ప్రతిసారి మీరు మీ కేశాలకు పని చెబితే ప్రజలే త్వరలో వాటిని పూర్తిస్థాయిలో పీకే పనిలో ఉంటారని ఎద్దేవా చేసారు.

కేంద్రాన్ని చూస్తే వైసీపీ సాష్టాంగమే, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే అధికార పార్టీలకు సాష్టాంగం గుర్తుకొస్తుందని పవన్‌ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయం భావోద్వేగాలతో కూడుకున్నదని, దీనిపై కచ్చితంగా మాట్లాతానని చెప్పారు. విశాఖలో కొండలు మింగేస్తారని తాను ఏనాడో చెప్పానన్నారు. యథా రాజా, తథా ప్రజా అన్నట్టుగా వైసీపీ పాలన సాగుతోందన్నారు. పేదల జోలికి వస్తే తోలుతీస్తానని పవన్‌ హెచ్చరించారు.