Site icon Prime9

Kuppa Thotti Roja : మంత్రి రోజాకి గట్టిగా ఇచ్చిన నాగబాబు… నీది నోరు కాదు చెత్తకుప్ప తొట్టి అంటూ

nagababu comparing ap minister roja mouth with dustbin

nagababu comparing ap minister roja mouth with dustbin

Kuppa Thotti Roja : మెగా బ్రదర్ నాగబాబు మంత్రి రోజాపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నీ నోరు చెత్త కుప్పతొట్టి ఒకటేనని అందుకే దానిని కెలుక్కోవడం ఇష్టం లేదన్నారు. మెగా ఫ్యామిలిని టార్గెట్ చేస్తూ రోజా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పర్యాటక శాఖ మంత్రిగా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు.

మంత్రి రోజా.. భారతదేశ పర్యాటకశాఖ ర్యాంకింగ్స్‌లో ఉన్న 20 స్థానాల్లో మొదటి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్‌లు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది, ఇంకా కిందకు వెళితే ఛత్తీస్‌గడ్, జార్ఖండ్‌లు ఉన్నాయి.

నువ్వు ఇలాగే నీ బాధ్యతను మర్చిపోయి.. నోటికొచ్చినట్లు పిచ్చ పిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానంకు దిగజారే అవకాశం ఉందని అన్నారు.

ఏపీ పర్యాటకశాఖ మీద కొన్ని వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బతుకుతున్నారు.

ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ల జీవితాలు మట్టికొట్టుకుపోయాయని తెలిపారు.

పర్యాటక మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు..  

నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. ముందు పర్యాటశాఖ మంత్రిగా నీ బాధ్యతలు నువ్వు తెలుసుకో.. పర్యాటకశాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు. పర్యాటక శాఖను ఎలా డెవలప్‌ చేయాలో చూడాలి అంటూ ఘాటుగా స్పందించారు. నువ్వు ఇన్ని రోజులు మా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు వాగావు. అఫ్‌కోర్స్ నా గురించి కూడా మాట్లాడావ్.. నేను వాటిని లెక్క చేయను. ఇన్నాళ్ళూ మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, మా అన్నయ్య చిరంజీవి గురించి నోటికొచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే.. ఒకటే ఒక్క కారణం ఉంది. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు.. చూస్తా చూస్తా మున్సిపాలిటీ కుప్పతొట్టిని గెలకరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటకశాఖను ఎలా డెవలప్‌ చేయాలో చూడు అంటూ ఓ వీడియోను విడుదల చేశారు.

అంతకు ముందు మంత్రి రోజా మాట్లాడుతూ.. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్‌ గారు ఎంత స్థాయిలో ఉన్నా.. అవి ఇచ్చిన ప్రజలకు సేవ చేయాలని సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవ్వరూ ఎందుకు కాలేదంటే.. వీళ్లని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు ఏ చిన్న సాయం కూడా చేయెలేదు. సొంత జిల్లాలో కూడా చేయలేదు.. అన్నదమ్ములు ముగ్గుర్ని సొంత జిల్లాలోనే ఓడించారు అంటేనే మనం అర్థం చేసుకోవాలి అంటూ రోజా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

 

ఇవి కూడా చదవండి :

Waltair Veerayya: “సుమ అడ్డా”లో మెగాస్టార్ చిరంజీవి.. వాల్తేరు వీరయ్య డైరెక్టర్‌తో?

Dhamaka : బాక్సాఫీస్ వద్ద మోత మోగించిన రవితేజ… ధమాకా @ 100 కోట్లు

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version