Site icon Prime9

Minister Roja : అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది అంటూ నాగబాబుకి బదులిచ్చిన ఇచ్చిన మంత్రి రోజా

minister roja shocking reply to nagababu comments

minister roja shocking reply to nagababu comments

Minister Roja : ప్రస్తుతం ఏపీలో మంత్రి రోజా హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల మెగా ఫ్యామిలిపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమరనికి దారి తీసాయి. ముగ్గురు అన్నదమ్ములకీ రాజకీయ భవిష్యత్‌ లేదు. అంత స్థాయిలో ఉండి కూడా ఎవరికీ సాయం చెయ్యరు. అందుకే ముగ్గుర్నీ సొంత జిల్లాలోనే ఓడించారు రోజా కామెంట్ చేసింది. అందుకు గాను మెగా బ్రదర్ నాగబాబు రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీ నోరు చెత్త కుప్ప తొట్టి ఒకటే అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. నిన్న ఆ వీడియోని నాగబాబు రిలీజ్ చేయగా ఈరోజు కూడా సోషల్ మీడియాలో #KuppaThottiRoja అనే హ్యాష్ ట్యాగ్ ఫుల్ ట్రెండింగ్ అయ్యింది. మెగా అభిమానులు కూడా ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాజాగా రోజా ఈ విషయంపై మరోసారి కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో రోజా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో.. “ఏదైనా విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చేయాలి.. అంతే గానీ నోటికి ఎంత వస్తే అంత వాగడం, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం సబబు కాదు. ఏమీ తెలియకుండా నా శాఖ గురించి వ్యాఖ్యలు చేయడం వాళ్ల అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. నేను పర్యాటక శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నాక ఇండియాలో ఏపీ టూరిజం మూడో స్థానంలో ఉంది. ఇదేమీ తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. నేను ఏనాడు చిరంజీవిగారు కేంద్రమంత్రిగా పర్యాటకంగా ఏపీకి ఏం చేసారని రాజకీయంగా మాట్లాడలేదు. మాట్లాడను కూడా. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి అని వెల్లడించారు.

గతంలో మీరు మీరూ (టీడీపీ-జనసేన) మాట్లాడుకున్న మాటల్నే గుర్తు చేస్తే ఎందుకంత పౌరుషం వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదు. అసలు గతంలో వాళ్లేం మాట్లాడుకున్నారో చూపించి.. సదరు వ్యక్తి కి ఈ వీడియో చేరేలా ఉండాలని షేర్ చేస్తున్నా.. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద శత్రుత్వం లేదు. పార్టీ పరంగా, సిద్ధాంతపరంగా నా వ్యాఖ్యలుంటాయని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. నన్ను అంత మాట అన్నందుకు మిమ్మల్ని కూడా ఓ మాట అనొచ్చు.. కానీ నా సంస్కారం అడ్డొచ్చింది అంతే.. చివరగా ఒక్క మాట.. ఆనాడు మీ పార్టీ వాళ్లను స*కజాతి, అలగా జనం అని అంత హీనంగా మాట్లాడినప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుందో పైవాడికే తెలియాలి. ఓడిపోయిన మీరే అన్ని మాటలంటే.. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను ఎంత అనాలి. రాజకీయ విమర్శలు తప్పా, వ్యక్తిగత విమర్శలు చేయడం నాకిష్టం లేక మిమ్మల్ని ఆ మాట అనలేక వదిలేస్తున్నా.. ముందు మహిళను ఎలా గౌరవించాలో తెలుస్కోండి అంటూ పోస్ట్ పెట్టారు. ఈ విషయం కాస్తా ఇప్పుడు మరింత ముదిరేలా కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.   

ఇవి కూడా చదవండి…

Janasena Party : వైసీపీ ముగ్గుల పోటీల్లో జై జనసేన అన్న యువతి.. అంబటి రాంబాబుకి షాక్

Mekapati Chandrashekar Reddy: ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మొదటి భార్య కొడుకుని అంటూ.. బహిరంగ లేఖ.

Kuppa Thotti Roja : మంత్రి రోజాకి గట్టిగా ఇచ్చిన నాగబాబు… నీది నోరు కాదు చెత్తకుప్ప తొట్టి అంటూ

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version