Site icon Prime9

K Viswanath Funeral: ఇక సెలవు.. ముగిసిన కె. విశ్వనాథ్ అంత్యక్రియలు

VishwanathARTGBU1N6GS73jpg

VishwanathARTGBU1N6GS73jpg

K Viswanath Funeral: తెలుగు సినిమా చరిత్రలో ఓ శకం ముగిసింది. సినీ దిగ్గజం​ కళాతపస్వి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పంజాగుట్ట స్మశానవాటికలో కుటుంబ సభ్యులు సాంప్రాదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. తెలుగు దిగ్గజ దర్శకుడు.. కె. విశ్వనాథ్‌ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సినిమా స్థాయినీ.. గుర్తింపును ఉన్నత శిఖరాన ఉంచారు. ఆయన లేరన్న వార్తతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

కె. విశ్వనాథ్‌ అంత్యక్రియలు పంజాగుట్టలోని స్మశానవాటికలో ముగిశాయి. సినీ ప్రముఖులు.. అభిమానుల ఆశ్రునయనాల మధ్య ఈ అంతిమయాత్ర సాగింది. దిగ్గజ దర్శకుడి కడసారి చూపు కోసం.. అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ప్రముఖులు నివాళులు..

విశ్వనాథ్ మరణ వార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోడీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లరి నరేష్, వెంకయ్య నాయుడు, అల్లు అర్జున్ పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

విశ్వనాథ్ ప్రముఖ సినిమాలు..

తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు విశ్వనాథ్. కమర్షియల్ చిత్రాలకు దూరంగా.. సామాజిక కథలకు పెద్దపీట వేశారు. విశ్వనాథ్ తెరకెక్కించిన ఆణిముత్యాల్లో ఐదు చిత్రాలు జాతీయ అవార్డును సైతం అందుకున్నాయి.

కళాతపస్వి తెరకెక్కించిన అధిక చిత్రాలు సంగీతం, సాహిత్యం, నాట్యం ప్రధానమైనవే. కె.విశ్వనాథ్‌ చిత్రాల్లో.. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు.. లోతైన మాటలుంటాయి.

వీనుల విందైన సంగీతంతో ఆయన తెరకెక్కించే చిత్రాలు ప్రతి సినీ ప్రియుడి మదిలో చెరగని ముద్రను వేశాయి. కళలకు జీవం పోస్తూ ఆయన తీసిన చిత్రాలు అజరామరం.

అందులోనూ ఆయన రచించి, తెరకెక్కించిన శంకరాభరణం, సప్తపది, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం… ఈ ఐదు చిత్రాలు అంతటా ప్రాచుర్యం సొంతం చేసుకున్నాయి.

కేంద్రప్రభుత్వం సైతం ఈ ఐదు చిత్రాలకు జాతీయ అవార్డులను అందించింది.

కమర్షియల్‌ హంగులు లేకుండా కేవలం సంగీతమే ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కిన చిత్రం శంకరాభరణం. జె.వి.సోమయాజులు ఈ సినిమాకు ప్రాణం పోశారు.

ఈ సినిమా 1980లో విడుదలై ఘన విజయాన్ని విజయాన్ని అందుకుంది. ఇందులోని పాత్రలు, పాటలు, మాటలు.. ఇప్పటికీ, ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

అందుకే ఈ చిత్రానికి ఎన్నో అవార్డులు వెతుక్కుంటు వచ్చాయి. ఈ సినిమా ముఖ్యంగా నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకుంది.

మనుషులను విడదీసే కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతీకగా నిలిచే చిత్రం సప్తపది.

వివాహం నేపథ్యంలో సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా సమాజంలో పేరుకుపోయిన కులవ్యవస్థను ప్రశ్నించింది. జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది ఈ సినిమాకి.

కె.విశ్వనాథ్‌ కలం నుంచి జాలువారిన మరో అపురూప చిత్రం స్వాతిముత్యం. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్త్రీకి.. మళ్లీ వివాహం చేయాలనే ఆలోచన రేకెత్తించిన చిత్రమిది.

కమల్‌హాసన్‌లోని నటనను ఆవిష్కరించే అద్భుతమైన చిత్రాల్లో ఇదీ ఒకటి. అమాయకుడిగా కమల్‌హాసన్‌, భర్తను కోల్పోయిన వితంతువుగా రాధిక నటించిన తీరు ప్రేక్షకులను హృదయాలను కట్టిపడేసింది. సినీ ప్రియులే కాకుండా ప్రముఖుల ప్రశంసలు సొంతం చేసుకున్న ఈ సినిమా… తెలుగులో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా జాతీయ అవార్డు అందుకుంది.

అవినీతి అక్రమాలను ఎదుర్కోవడానికి హింస మార్గం కాదని, శాంతియుత మార్గమే ఉత్తమమని చాటి చెప్పిన చిత్రం సూత్రధారులు.

అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్‌, భానుచందర్‌, రమ్యకృష్ణ, సత్యనారాయణ నటించిన ఈ సినిమా.. 1989లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా కూడా తెలుగులో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా జాతీయ అవార్డును పొందింది.

విశ్వనాథ్ ని వరించిన అవార్డులు..

1980-జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం -శంకరాభరణం

1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం – సప్తపది

1984- జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు సాగరసంగమం

1986 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు – స్వాతిముత్యం

1988 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు శృతిలయలు

2004 – జాతీయ ఉత్తమ చలనచిత్రం – తెలుగు స్వరాభిషేకం

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version