Site icon Prime9

Jr NTR Meet Amit Shah: అమిత్ షాతో బాద్ షా భేటీ.

Hyderabad: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. ఇద్దరూ కలిసి డిన్నర్ చేశారు. నోవాటెల్ హోటల్ లో దాదాపు 30 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది.

ఈ ఇద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయింది. బీజేపీ అగ్రనేతను ఎన్టీఆర్‌ కలవడం ఆసక్తికరంగా మారింది. అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ ఏయే అంశాలపై చర్చించారు అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీజేపీ వర్గాలు మాత్రం ఇది రాజకీయ భేటీ కాదంటున్నాయి. ఆర్‌ఆర్ఆర్‌ సినిమాలో ఎన్టీఆర్ అద్భుత నటనను అమిత్‌ షా ప్రశంసించినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఇంకా ఏయే అంశాల పై చర్చించి ఉంటారనేది ఇంట్రస్టింగ్ గా మారింది.

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో రాజకీయ బలంతో పాటు సినీ గ్లామర్‌ను వాడుకోవాలని బీజేపీ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా ఎవరితో భేటీ అయినా దానికి కచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది. బీజేపీకి ఉపయోగపడే విధంగా ఆయన చర్చలు జరుపుతారు.

Exit mobile version