Pawan Kalyan : జనసేనాని “పవన్ కళ్యాణ్” నామస్మరణతో ఊగిపోతున్న సోషల్ మీడియా..

టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. కాగా సమాజానికి ఏదైనా చేయాలి.. ప్రజలకు తోడుగా నిలవాలి అనే సంకల్పంతో  పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది.  ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 02:54 PM IST

Pawan Kalyan : టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. కాగా సమాజానికి ఏదైనా చేయాలి.. ప్రజలకు తోడుగా నిలవాలి అనే సంకల్పంతో  పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది.  ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్.  కాగా జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నేడు నిర్వహించనున్నారు.

పవన్ (Pawan Kalyan)  మానియాతో షేక్ అవుతున్న సోషల్ మీడియా..

మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా పవన్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి పోస్ట్ లు పెడుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారనే చెప్పాలి. పవన్ మానియాతో ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదని అందరికీ తెలిసిందే. ఇక 2024 ఎన్నికలకు పవన్ సిద్ధపడుతున్న వేళ..  ఈ సభా వేదికగా పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే పవన్ ఏం ప్రకటన చేస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ప్రభుత్వాన్ని గద్దే దించడమే లక్ష్యంగా ఆయన ఒంటరిగా వెళ్తారా? లేదా టీడీపీ, బీజేపీతో కలిసి పయనిస్తారా? అన్నది ఈ సభలో పవన్ మాట్లాడతారని వెల్లడించే అవకాశం ఉంది. ప్రతిపక్ష ఓటు చీలకుండా చేస్తామన్న పవన్ ఏ నిర్ణయం తీసుకున్న అందుకు కట్టుబడి ఉంటామని జనసేన నేతలు, కార్యకర్తలు వెల్లడిస్తున్నారు.

ఈ మేరకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కాగా బందరు నగర శివారులో జరగనున్న ఈ వేడుక కోసం జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ  మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ ఆటోనగర్ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి నుంచి ర్యాలీగా సభా వేదికకు చేరుకుంటారు. మొదటిసారి పవన్ వారాహిపై రానుండడం గమనార్హం.  సభా స్థలంలో 1,20,000 మంది పైగా కూర్చునేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఈ మేరకు ఉదయం నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ భారీ ఎత్తున సభా స్థలి వద్దకు చేరుకుంటున్నారు.

ఈ కార్యక్రమం జరిగే సభా వేదిక వద్దకు మొదటి సారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనంలో చేరుకోనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సభ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆవిర్భావ సభ కోసం కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఈ దిగ్విజయ సభ కోసం 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కనీవినీ ఎరుగని రీతిలో సభ స్థలి ముస్తాబు అయ్యింది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని వసతులతో సభా ప్రాంగణం సిద్ధం అయ్యింది. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం చేశారు. సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా స్థలం కేటాయించినట్లు తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/