Site icon Prime9

IT Raids : మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇళ్ళు, ఆఫీసుల్లో ఐటీ దాడులు..

it raids on mythri movie makers and director sukumar house, offices

it raids on mythri movie makers and director sukumar house, offices

IT Raids : మరోసారి ఐటీ అధికారుల దాడులతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. పుష్ప చిత్ర దర్శకుడు సుకుమార్, ఆ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఈ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన సినిమాల నేపథ్యంలో పన్ను ఎగవేశారన్న సమాచారంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల ఈ బ్యానర్ నిర్మించిన ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల విడుదలకు ముందు ఈ సంస్థలో ఐటీ అధికారులు సోదాలు చేశారు.

Exit mobile version