Site icon Prime9

Adivi Sesh : నేను శారీరకంగా మరియు మానసికంగా అలసిపోయాను

Hit 2 movie

Hit 2 movie

Adivi Sesh :హీరో కంటే విభిన్నమైన నటుడిగా పేరు తెచ్చుకుంటున్న అడవి శేష్ త్వరలో హిట్ 2 సినిమా తో మన ముందుకు రబోతున్నాడు.షెడ్యూల్ ప్రకారం హిట్ 2 సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి అవ్వాల్సింది కాని అడవి శేష్ బిజీగా ఉండటం వల్ల ఆలస్యం అవుతుంది. మేజర్ సినిమా ప్రమోషన్ కోసం దేశ వ్యాప్తంగా తిరుగుతున్న నాకు కాస్త బ్రేక్ కావాలని అంటున్నారు.

మేజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ఇపుడు హిట్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. HIT 2 షూటింగ్ కు అడవి శేష్ హాజరు అవ్వలేక పోతున్నాను అంటూ, నేను శారీరకంగా మరియు మానసికంగా అలసిపోయాను అందుకని షూటింగ్ కు కాస్త బ్రేక్ కావాలి అని చిత్ర యూనిట్ కు ఒక లేఖ రాశాడు.

త్వరలోనే హిట్ 2 సినిమాను పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటిస్తామని అడవి శేష్ చెప్పారు. మెజార్టీ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యిందని తెలుస్తోంది. హిట్ 1 లో విశ్వక్ సేన్ నటించిన విషయం తెల్సిందే. థియేట్రికల్ రిలీజ్ లోనే కాకుండా ఓటీటీ ద్వారా కూడా హిట్ కు మంచి స్పందన వచ్చింది. అందుకే హిట్ 2 కి విపరీతమైన బజ్ ఏర్పడింది. కాగా అడవి శేష్ నటిస్తున్న కారణంగా హిట్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar