Lokesh -Tarak: నందమూరి తారకరత్న నారా లోకేష్ ను కలవడం రాష్ట్రంలో చర్చనీయంశంగా మారింది. హైదరాబాద్ లోని లోకేష్ నివాసంలో ఈ భేటి జరిగింది. స్వయంగా లోకేష్ ఇంటికి వెళ్లిన తారకరత్న పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో కుటుంబ విషయాలతో పాటు రాజకీయాలు ఉన్నట్లు సమాచారం.
తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా?
తారకరత్న వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో ఓ సారి తారకరత్న ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతోనే లోకేష్ తో భేటీ అయినట్లు సమాచారం. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే విషయం చర్చించినట్లు తెలుస్తోంది.
లోకేష్ ఏమన్నారో తెలుసా?
వచ్చే ఎన్నికల్లో ఓ ప్రముఖ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని లోకేష్ సూచించినట్లు సమాచారం. గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని లోకేష్ అనుకుంటున్నారట. ఇదే విషయమై వీరిద్దరు చర్చించినట్లు కథనాలు వచ్చాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు.. ప్రభుత్వం మార్పుపై చర్చ జరిగినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం తారకరత్న చేసిన వ్యాఖ్యలు ఈ సమావేశంతో వైరల్ అవుతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం మీద తారక్ పలు విమర్శలు చేశారు. ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం మారాలని సూచించారు.
ఇక ఈ సమావేశంపై తారక్ ట్వీట్ చేశారు. లోకేష్ తనకు సమయం కేటాయించినందుకు తారక్ ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి గత వైభవం తెచ్చేలా ప్రయత్నిద్దామని తారక్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
CCTV: హైదరాబాద్‌లో పిల్లిని ఎత్తుకుపోతున్న దొంగ.. CCTV ఫుటేజ్ వైరల్
Khammam Politics: ఖమ్మంలో ఊహించని ట్విస్ట్‌లు.. ఫిక్స్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. పోతే పోనియండన్న కేసీఆర్
Constable Leave Letter: సార్ నా భార్య అలిగింది.. బుజ్జగించడానికి లీవ్ ఇవ్వండి
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/