Director Bobby: “చిన్నప్పటి నుంచి సినిమా అనే పిచ్చితో పాటు చిరంజీవీ అనే ఓ మత్తు తో పెరిగాను. ఈరోజు ఆయనతో సినిమా తీస్తున్నానంటే.. ఇదొక స్పెషల్ మూమెంట్. మెగాస్టార్ పై ఉన్న ప్రేమనే ఈ సినిమాలో చూపించా” అన్నారు వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వం వహించిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం విశాఖలోని ఏయూ కాలేజీ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు.
పవన్ కళ్యాణ్ అంటే మాటకు మాట, కత్తికి.. కత్తి..
ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ.. 2003లో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఆ టైంలో చిరుతో సినిమా చేయలేకపోయానే అని భాదపడ్డానన్నారు. ’’అన్నయ్యకు రాజకీయాలు కరెక్ట్ కాదు. దేవుడు ఆయనకు ఒక తమ్ముడ్ని ఇచ్చాడు. రాజకీయాలను అతడు చూసుకుంటాడు. అతడే సమాధానం చెబుతాడు. అతనే గట్టిగా నిలబడతాడు. చిరంజీవి నుంచి వచ్చిన ఆవేశం, మంచితనం కలిపితే పవర్‌స్టార్. మాటకు మాట, కత్తికి కత్తి, బదులుకు బదులు అనే వ్యక్తి పవర్ స్టార్‘‘ అని బాబీ(Director Bobby) తెలిపారు.
ఇండస్ట్రీకి ఒక్కడే మెగాస్టార్..
“నేను చిరంజీవి కంటే ముందు పవర్‌స్టార్‌తో పని చేశాను. ఇపుడు మెగాస్టార్ తో పని చేస్తున్నాను. ఊరికే మెగాస్టార్స్ అయిపోరు. చిరు ఫ్యాన్స్‌గా పుట్టడం మేం చేసుకున్న అదృష్టం. ఇండస్ట్రీకి ఒక్కడే మెగాస్టార్’ అని వ్యాఖ్యానించారు డైరెక్టర్ బాబీ. అయితే ప్రస్తుతం బాబీ(Director Bobby) పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. విశాఖ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో కూడా చర్చగా మారాయి.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్స్.. సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో హీరో రవితేజ ముఖ్య పాత్రను పోషించడం విశేషం.చాలా రోజుల తర్వాత చిరంజీవి తన మార్క మాస్ కామెడీ సినిమా చేస్తుండటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Waltair Veerayya: లక్ష్మణరేఖనైనా దాటుతాను కానీ సురేఖను దాటను.. సుమ అడ్డాలో చిరు కామెంట్స్
Nandamuri Balakrishna : తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి ఓపెన్ అయిన బాలకృష్ణ..
KGF 3: 2025లో సెట్స్ పైకి వెళ్లనున్న KGF 3.. మరోసారి రాకీభాయ్ గా కనిపించనున్న హీరో యష్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/