Site icon Prime9

Chiranjeevi: సూపర్ హిట్లు ఇవ్వడం కాదు, టెక్నాలజీ వాడటం కాదు.. ముందు సినిమా తీయడం నేర్చుకోండి

chiranjeevi sensational comments about directors

chiranjeevi sensational comments about directors

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా శృతిహాసన్ నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.

బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ముఖ్యపాత్రలో నటించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా  బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

తాజాగా ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం హాజరయ్యారు.

ఈ సంధర్భంగా చిరంజీవి(Chiranjeevi) మాట్లాడుతూ.. నేటి తరం దర్శకులు సూపర్ హిట్లు ఇవ్వడం కాదు, టెక్నాలజీ వాడటం కాదు.. ముందు సినిమా తీయడం నేర్చుకోండి అంటూ హితవు పలికారు.

డైరెక్టర్‌కి గర్వం ఉండకూడదు.. బాబీ నా మాట విన్నాడు.. ఇప్పుడు వినేవాళ్లే లేరు అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

నిర్మాతల డబ్బును బుట్టదాఖలు చేయవద్దని, సినిమాకు కావాల్సినవన్నీ పేపర్‌ వర్క్‌ లోనే పూర్తి చేసేయాలని చిరంజీవి దర్శకులకు సూచించారు.

డైరెక్టర్స్ ఈగోలకి వెళ్ళకూడదు. డైరెక్టర్ సినిమా హిట్ ఇవ్వడం కాదు. ఇచ్చిన టైములో, ఇచ్చిన బడ్జెట్ లో సినిమాని తీయగలగాలన్నారు.

కొత్త టెక్నాలజీ కావాలని.. ఎక్కువ సేనలు అయిన సరే తీసి తర్వాత కట్ చేయాలని చూడొద్దన్నారు. మన దగ్గర సరైన కంటెంట్ ఉంటే సాధారణ కెమెరాతో సినిమా తీసి అయిన హిట్ కొట్టవచ్చని అన్నారు.

డైరెక్షన్ ఎలా చెయ్యాలో చెప్పిన చిరంజీవి..

అవసరమైతేనే టెక్నాలజీ అయిన వినియోగించుకోవాలని సూచించారు. షూటింగ్ కూడా వాసరమైన వరకే తెరకెక్కిస్తే మంచిదని.. ఎడిటింగ్ కూడా ముందుగానే విజవలైజ్ చేసుకొని నిర్మాతలపై భారాన్ని తగ్గించాలన్నారు.

ఎవరో డైరెక్టర్ భారీగా తీశారు కదా అని మనం అక్కర్లేకపోయినా భారీగా వెళ్ళకూడదు. సినిమాని షూట్ చేసి ఇది అక్కర్లేదు అని ఎడిటింగ్ లో కట్ చేయకూడదు.

అలా చేయడం వాళ్ళ డబ్బు, టైం, కష్టం అంతా వేస్ట్ అవుతుంది. అదంతా నిర్మాతలకి నష్టమే. ఏ మార్పులు, చేర్పులు ఉన్నా పేపర్ వర్క్ మీదే చేసుకోవాలి.

అంతా ఓకే అనుకున్నాకే షూట్ కి వెళ్ళండి అంటూ చిరంజీవి సూచించారు. నిర్మాతలు ఉన్నారు కదా అని డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టొద్దు.

నిర్మాతలు బాగుంటేనే మనం బాగుంటం, సినీ పరిశ్రమ బాగుంటుంది. ఇది దర్శకులు గుర్తించాలి అని అన్నారు. అలాగే ఈ వ్యాఖ్యలని ఏ డైరెక్టర్ ని ఉద్దేశించి చేయలేదని.. దయచేసి

మీడియా వాళ్ళు తప్పుగా రాయకండి అని మెగాస్టార్ కోరారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version