Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. తొలి రోజు వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది సుమారు ఈ ఇద్దరిని సీబీఐ ఐదున్నర గంటలపాటు విచారించింది.
సుదీర్ఘ విచారణ..
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. తొలి రోజు వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సుమారు ఈ ఇద్దరిని సీబీఐ ఐదున్నర గంటలపాటు విచారించింది. ఇక ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురి వాంగ్మూలను నమోదు చేసింది.
తొలి రోడు ఈ ఇద్దరిని సీబీఐ ఐదున్నర గంటలపాటు విచారించింది. బుధవారం ఉదయం 10.40 నిమిషాలకు చంచల్‌గూడ జైలు నుంచి భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌లను సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.15 నిమిషాల వరకు ఇద్దరినీ వేర్వేరుగా విచారించినట్టు తెలుస్తోంది.
ఈ విచారణలో సీబీఐ కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. వివేకా హత్యకు గల కారణాలు.. హత్య అనంతరం గుండెపోటుగా చిత్రికరించారనే విషయలాపై సీబీఐ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో ఈ విచారణ కొనసాగినట్లు తెలుస్తోంది.
ఇక ఈ విచారణలో వీరు చెప్పిన సమాచారం ఆధారంగా అవినాష్ రెడ్డిని విచారించనున్నారు. విచారణ అనంతరం.. భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఉదయం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణను పూర్తిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని 6 రోజుల సీబీఐ కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. అవినాష్‌రెడ్డి కూడా ఈనెల 25 వరకు ప్రతిరోజు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.