Site icon Prime9

Samantha: ఆ విషయంలో సమంతకి సపోర్ట్ గా బాలీవుడ్ యంగ్ హీరో..

varuna dhawan supports samantha

varuna dhawan supports samantha

Samantha: స్టార్ హీరోయిన్ సమంతకి బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ సపోర్ట్‌గా నిలిచాడు. ఒక వైపు నాగచైతన్యతో విడాకుల కారణంగా మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు సమంత. ఆ సమయంలో బాగా లో అయ్యారు. ఇటీవలే తాను మయోసైటీస్ తో బాధపడుతున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ఈ భామ. దీంతో అనారోగ్యం కారణంగా ఎక్కువగా యాక్టివ్ గా ఉండడం లేదు. ‘యశోద’ మూవీ రిలీజ్‌కి ముందు ఈ విషయాన్ని ప్రకటించిన సమంత.. ఆ తర్వాత నుంచి ఎక్కువగా పబ్లిక్ లోకి రావడం లేదు.

కన్నీరు పెట్టుకున్న సమంత

కాగా చాలా కాలమ తర్వాత సోమవారం రోజు ఆమె నటించిన ‘శాకుంతలం’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి హాజరైంది. గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో గుణ శేఖర్ ఈ మూవీ గురించి మాట్లాడుతున్న సమయంలో సామ్ కన్నీళ్లు పెట్టుకుంది. ఎప్పుడు హుషారుగా కనిపించే సమంతని ఇలా ఎప్పుడు చూడలేదంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాధని వ్యక్తం చేశారు. కానీ కొన్ని పేజీలు మాత్రం కొంత మంది నెటిజన్లు మాత్రం సమంత(Samantha)పై వెటకారంగా కామెంట్స్ చేశారు.

ఫ్యాన్స్ ముందే.. వెక్కివెక్కి ఏడ్చేసిన సమంత..| Prime9 News

#Buzz Basket అనే పేజీ సమంత గురించి ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో.. “సమంత తన ఫేస్‌లో గ్లో తగ్గిపోయిందని విడాకులు తర్వాత చాలా స్ట్రాంగ్‌గా కనిపించిన సమంత ఇప్పుడు చాలా బలహీనంగా ఉందంటూ వెటకారం చేశారు. దాంతో ఈ కామెంట్స్‌పై సమంత కూడా స్పందించింది. ‘నా తరహాలో నెలల తరబడి ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మందులు వాడాల్సిన లైఫ్‌ మీకు రాకూడదని ప్రార్థిస్తున్నాను. అలానే మీ గ్లో కూడా పెరగాలని కోరుకుంటున్నా’ అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మద్దతుగా నిలిచాడు.

సామ్ పై కామెంట్స్‌ చేసిన పేజీకి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆ పోస్ట్ కి రిప్లయ్ ఇస్తూ.. ‘మీరు కేవలం నెగటివ్ యాంగిల్‌లో రాసి క్లిక్ బైట్స్‌ కోసం చూస్తున్నారు. కానీ మీరు చూడాల్సింది పనిపట్ల సమంతకి ఉన్న అంకితభావాన్ని. ఒకవేళ మీకు గ్లో కావాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిల్టర్ ఆఫ్షన్ అందుబాటులో ఉంది’ అంటూ చురకలు అంటించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Package Star Jagan: ప్యాకేజీ స్టార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి: శవాలపై పేలాలు ఏరుకోవడం అంటే ఇదే.. ఇందుకే పవన్ కళ్యాణ్ తిట్టేది..

Lokesh -Tarak: గన్నవరం బరిలో తారకరత్న?.. లోకేశ్ మాస్టర్ స్ట్రోక్

DL Ravindra Reddy: చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కలిస్తే జగన్ పార్టీకి సింగిల్ డిజిట్.. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar