Site icon Prime9

Ambati Rambabu : పాదయాత్ర చేసినోడల్లా నాయకుడు కాలేడు – నారా లోకేష్ యువగళంపై అంబటి రాంబాబు

ambati rambabu comments on nara lokesh yuvagalam padayatra

ambati rambabu comments on nara lokesh yuvagalam padayatra

Ambati Rambabu : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.

చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో లక్ష్మీపురం వద్ద శ్రీవరదరాజస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ‌తో పాటు పలువురు టీడీపీ కీలక నేతలు పాల్గొన్నారు.

వేలాది మంది పార్టీ కార్యకర్తలు తరలిరాగా.. ముందే అనుకున్న ముహూర్తం ప్రకారం 11.03 గంటలకు లోకేష్ తన పాదయాత్రను ప్రారంభించారు.

లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

అంబటి రాంబాబు (Ambati Rambabu) ట్వీట్..

అయితే నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ ను ఉద్దేశస్తూ… ‘ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు’ అని ఎద్దేవా చేశారు.

 

 

కొడాలి నాని ట్వీట్..

అలానే నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కొడాలి నాని.

కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అసమర్థుడని ధ్వజమెత్తారు. చందాలిచ్చిన వారికోసం తప్ప లోకేష్ పాదయాత్ర దేనికి పనికిరాదని ఎద్దేవా చేశారు.

లోకేష్ ఏం సాధించాడని, ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నాడు? అని కొడాలి ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు అని తప్ప లోకేష్‌ ఉ‍న్న అర్హత్ ఏంటి? అని అడిగారు.

పోటీ చేసిన చోట ఓడిపోయిన పప్పు సుద్ద లోకేష్ అని దుయ్యబట్టారు. అలాంటి లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీనుందా? అని ఎద్దేవా చేశారు.

నందమూరి తారకరత్నకు గుండెపోటు..

పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న.. సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయన్ను హుటాహుటిన కుప్పంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుప్పం ఆసుపత్రికి చేరుకుని తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి ఆరా తీశారు.

వైద్యులు ఆయనకు చెప్పిన విషయాలను బాలకృష్ణ మీడియాతో పంచుకున్నాడు.

తారకరత్నకు తీవ్ర గుండెపోటు వచ్చిందని.. ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్ నిర్వహించారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని.. మిగతా రిపోర్టులన్నీ కూడా బాగానే ఉన్నాయని బాలయ్య తెలిపారు.

స్థానిక వైద్యులు తారకరత్నకు కావాల్సిన ప్రాథమిక వైద్యాన్ని అందించారని.. వారి సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు.

ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్యం గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తారకరత్న భార్య ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారని.. అభిమానుల ఆశీస్సులు అతడిని శ్రీరామరక్షలా కాపాడతాయని బాలకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.

ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలయ్య ప్రకటించడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version