Site icon Prime9

Health Tips: కిడ్నీలోని రాళ్లను కరిగించే అద్భుతమైన ఆయుర్వేదం.. పిండికూర ఆకు

pindi-kura greens-for-kidney-stones-treatment-in-ayurveda

pindi-kura greens-for-kidney-stones-treatment-in-ayurveda

Health Tips: నేటి తరం ప్రజలకు చాలా మందికి మన సంప్రదాయ వైద్యం గురించి కానీ ఆహార వ్యవహారాల గురించి కానీ పెద్దగా తెలియదని చెప్పవచ్చు. అయితే అలాంటి పురాతన సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఒకటయిన పిండి కూర ఆకు దీనిని పాషాణభేది, కొండపిండి చెట్టు, తెలగ పిండి చెట్టు అని కూడా అంటుంటారు. మరి ఈ మొక్క విశిష్టతలేంటి ఎక్కడ దొరకుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ ఆకుకూర తింటే అనేక ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద వైద్యనిపుణులు అంటున్నారు.

ఈ పిండి కూర చెట్టు సాధారణంగా ఒక కలుపుమొక్క. విరివిగా మన ఇంటి ముందు, మన పెరట్లో, చెలకల్లో, పొలాల్లో అంతటా కనిపిస్తుంది. సంక్రాంతి సమయంలో గొబ్బెమ్మలకు రేగు పండ్లు, నవ ధాన్యాలతోపాటు ఈ పిండి కూర రెక్కలను కూడా అలంకరిస్తారు. అయితే పిండి కూర ఆకులో ఒక విశేషమైన గుణం ఉందని ఆయుర్వేదం చెప్తుంది. ఇప్పుడు ప్రతి పదిమందిలో ఒకరిద్దరని కిడ్నీలో రాళ్ల సమస్య వేధిస్తోంది. ఏవేవో ట్రీట్ మెంట్లు పొందుతున్నారు కాగా ఈ సమస్యకు ఈ పిండికూర ఆకు ఒక చక్కని పరిష్కారమని ఆ రాళ్లను ఇట్టే కరిగించేస్తుందని చెప్తున్నారు. ఈ పిండి కూర ఆకులు పిడికెడు తీసుకుని పరిగడుపున మూడు రోజులపాటు తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్యలకు వెంటనే చెక్ చెప్పవచ్చని చెబుతారు. మరి ఈ పిండి కూర ఆకును ఎలా ఔషధంగా తీసుకోవాలో చూసేద్దాం.

1. పిండి కూర మొక్కను వేర్లతో సహా బాగా కడికి వాటిని కట్ చేసి అర లీటరు నీటిలో మరగబెట్టాలి. అది బాగా మరిగి సంగం నీరు ఇంకిపోయిన తర్వాత అప్పుడు దానిని దించి వడబోసుకోవాలి. దీనికి పటిక బెల్లం ఒక 30 గ్రాములు, శిలాజిత్ పొడి ఒక 2 గ్రాములు కలుపుకుని ప్రతిరోజూ పరగడపున తాగాలి. తాగిన తరువాత గంటసేపు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల కిడ్నీల్లోని రాళ్లు కరిగి .
మూత్రం ద్వారా వెళ్లిపోతాయి.

2. పిండి కూర మొక్కలు వేర్లతో సహా తెచ్చి బాగా కడిగి మెత్తగా దంచి దాని నుంచి వడపోత ద్వారా రసం తీయాలి. దానికి సమపాళ్లలో పటిక బెల్లం కలపాలి. ఈ ద్రావణాన్ని సన్నని మంటపై లేతగా పాకం వచ్చే వరకూ మరిగించాలి. ఆ తరువాత చల్లార్చి నిల్వ ఉంచుకోవచ్చు. దీనిని పెద్దవాళ్లయితే రోజుకు ఒకటి రెండు చెంచాలు, పిల్లలైతే అర చెంచా రోజూ తీసుకుంటే మూత్రపిండాల వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చుని చెప్తున్నారు.

3. పిండి కూర ఆకును శుభ్రంగా కడిగి కూరగా వండుకొని తినవచ్చు. పప్పులో కూడా వేసుకోవచ్చు. తద్వారా మూత్రపిండాల్లో ఉన్న వ్యర్థాలు తొలగిపోతాయని చెప్తున్నారు.

4. పిండి కూర వేర్లు, ఆకులు, పువ్వులు ఎండబెట్టి పొడి చేసి నిల్వ ఉంచుకోవచ్చు. తేయాకు పొడికి బదులుగా దీనిని వేసుకుని టీ చేసుకుని తాగొచ్చు. తద్వారా మూత్రాశయ సంబంధిత వ్యాధులన్నీ నయమవుతాయి.

ఇదీ చదవండి: ఒత్తిడి ఆందోళనకు ఈ ఆహారంతో చెక్ పెట్టండిలా..!

Exit mobile version