Site icon Prime9

Vijay Sethupathi: విజయ్ సేతుపతి హీరోగా “సిద్ద రామయ్య బయోపిక్”..!

Vijay Sethupathi in former karnataka CM Siddaramaiah biopic

Vijay Sethupathi in former karnataka CM Siddaramaiah biopic

Vijay Sethupathi: ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీ నాట బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. మొన్నామధ్య ఆలియాభట్ నటించిన గంగూభాయ్ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా తాజాగా క‌ర్నాట‌క మాజీ సీఎం, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత సిద్ధ‌రామ‌య్య‌పై బ‌యోపిక్ తీసేందుకు రంగం సిద్దమైంది. టైటిల్ రోల్ లో నటించేందుకు త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తిని చిత్ర మేకర్స్ సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. త‌నపై తీయనున్న బ‌యోపిక్ ప్రాజెక్టుకు 75 ఏండ్ల‌ సిద్ధ‌రామ‌య్య అధికారికంగా గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వాల్సి ఉంది.

సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌పై బ‌యోపిక్ నిర్మించేందుకు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, అభిమానులు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. మ‌రోవైపు త‌న బ‌యోపిక్‌లో తాను న‌టించ‌డం లేద‌ని సిద్ధ‌రామ‌య్య స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది. అయితే త‌న బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు ఆయ‌న వ‌చ్చే వారం త‌న స‌మ్మ‌తిని తెలియ‌చేస్తార‌ని ఆయన మ‌ద్ద‌తుదారులు చెబుతున్నారు. మ‌రోవైపు విజ‌య్ సేతుప‌తి పోలీస్ పాత్ర‌లో క‌నిపించే డీఎస్‌పీ మూవీ అఫిషియ‌ల్ ట్రైల‌ర్ ఇటీవ‌ల రిలీజై సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇదీ చదవండి: ప్రభాస్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కృతి

 

Exit mobile version