Site icon Prime9

Upcoming Releases : ఈ వారం థియేటర్/ఓటీటీ లలో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల వివరాలు..

upcoming releases of movies and web series details in november 3rd week

upcoming releases of movies and web series details in november 3rd week

Upcoming Releases : నవంబరు మూడో వారంలో పలు ఆసక్తికర చిన్న చిత్రాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. అలాగే ఓటీటీలోనూ మూవీలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు (Upcoming Releases)..

మంగళవారం…

ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత “మహాసముద్రం” సినిమాతో వచ్చిన అజయ్ భూపతి ప్రేక్షకులను నిరాశ పరిచాడు. కాగా ఇప్పుడు మళ్ళీ ఆ బోల్డ్ కాంబోని రిపీట్ చేస్తున్నాడు. పాయల్ ముఖ్య పాత్రలో మరో సినిమాతో రాబోతున్నాడు అజయ్. మంగళవారం అనే టైటిల్ తో ఈ మూవీ వస్తున్నట్లు తెలుస్తుంది. ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ.ఎం. నిర్మించారు. నవంబరు 17న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

మై నేమ్‌ ఈజ్‌ శృతి…

నటి హన్సిక ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ అంటూ సినీప్రియుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమవుతోంది . ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తుండగా, శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. ‘‘ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా హన్సిక కనిపిస్తుంది’’ అని సినీ వర్గాలు తెలిపాయి. ఈ నవంబరు 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్పార్క్‌: ది లైఫ్‌…

విక్రాంత్‌ హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’ . డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది.ఈ సినిమాలో మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది . అయితే ఈ సినిమా నవంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది.

సప్త సాగరాలు దాటి – సైడ్‌ బి… 

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-ఎ’ . రుక్మిణీ వసంత్‌ కథానాయిక. హేమంత్‌ ఎం రావు దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పుడిదే చిత్రానికి కొనసాగింపుగా ‘సప్తసాగరాలు దాటి – సైడ్‌ బి’ విడుదల కానుంది. నవంబర్‌ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇది ప్రేక్షకులను అలరించడానికి థియేటర్ లలో విడుదల కానుంది.

అన్వేషి…

విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్వేషి’ . వి.జె.ఖన్నా దర్శకత్వం వహిస్తున్నారు. టి.గణపతిరెడ్డి నిర్మాత. ‘‘అడవి నేపథ్యంలో సాగే కథ ఇది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్రని పోషించారు. ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. చైతన్‌ భరద్వాజ్‌ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకుంటాడు’’అని చిత్ర బృందం చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌ ల లిస్ట్ (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్‌…

హౌటూ బికమ్‌ ఏ మాబ్‌ బాస్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 14

బెస్ట్‌ క్రిస్మస్‌ ఎవర్‌ (హాలీవుడ్‌) నవంబరు 16

ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 16

బిలీవర్‌2 (కొరియన్‌) నవంబరు 17

ది డాడ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 17

సుఖీ (హిందీ) నవంబరు 17

ది రైల్వేమెన్‌ (హిందీ) నవంబరు 18

అమెజాన్‌ ప్రైమ్‌…

ట్విన్‌ లవ్‌ (హాలీవుడ్‌) నవంబరు 17

డిస్నీ+హాట్‌స్టార్‌… 

అపూర్వ (హిందీ) నవంబరు 15

చిత్త (తమిళ/తెలుగు) నవంబరు 17

కన్నూర్‌ స్క్వాడ్‌ (మలయాళం) నవంబరు 17

బుక్‌ మై షో…

రాంగ్‌ ప్లేస్‌ (హాలీవుడ్)నవంబరు 12

ది ఎగ్జార్సిస్ట్‌ (హాలీవుడ్‌) నవంబరు 17

జియో సినిమా…

ది ఫ్లాష్‌ (తెలుగు) నవంబరు 15

ఆపిల్‌ టీవీ ప్లస్‌…

మోనార్క్‌(హాలీవుడ్‌) నవంబరు 17

 

Exit mobile version