Veera Simha Reddy: నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా అద్భుతంగా నటించాడు. శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్యకి జంటగా నటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
అయితే, పక్కా మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని.. అభిమానులకు అయితే పండగ లాంటి సినిమా అని అంటున్నారు. ఇదిలా ఉంటే, ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని చాలా ఏరియాల్లో థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపించింది.
ఈరోజు తెల్లవారుజాము నుంచే ధియేటర్ల వద్ద బాలయ్య అభిమానులు డప్పుల మోతతో, టపాసుల శబ్దాలతో హడావుడి చేశారు. కాగా సినిమా చూసిన అభిమానులు బాలయ్య జాతర మొదలైంది అంటున్నారు. హై వోల్టాజ్ యాక్షన్ సీన్స్ తో పాటు సెంటిమెంటల్ ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది అంటున్నారు అభిమానులు. ఇక థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లింది. కాగా ఈ సినిమాలోని ఒక సీన్ పై నెటిజన్లు గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.
అప్పట్లో తొడగొడితే ట్రైన్ కదిలింది..
ఆ సీన్ ఏంటంటే విలన్లకు అదిరిపోయే రేంజ్ లో డైలాగ్ చెప్పిన తర్వాత వాళ్ళు ఉన్న కారును బాలకృష్ణ కాలితో తంతే వెనక్కి వెళ్ళిపోతుంది. కాలుతో కొడితే కారు వెనక్కి వెళ్ళిపోవడం ఏంటని కామెంట్లు చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. మరోవైపు బాలయ్య గత చిత్రం బ్రహ్మ నాయుడు సినిమాలో తొడకోడితే ట్రైన్ వెనక్కి వెళ్ళే సీన్ తో దీనిని పొలుస్తూ రెండు వీడియోలను కలిపి పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.
ఇవీ చదవండి
Aravana Prasadam: శబరిమల ‘అరవణ’ ప్రసాదం విక్రయాలు బంద్.. కారణం ఇదే?
Cs Somesh Kumar: మీకు కర్మసిద్దాంతం అంటే ఏమిటో తెలుసా? మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై తెలంగాణ టీచర్ సెటైర్లు
Vande Bharat Express: విశాఖలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీలపై రాళ్లదాడి
Veera Simha Reddy: మా నాన్న తర్వాతే ఎవరైనా.. బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి కామెంట్స్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/