Site icon Prime9

Tamannaah: ఇతడే నా భర్త.. పెళ్లి రూమర్స్ పై తమన్నా స్ట్రాంగ్ కౌంటర్

tamannaah reacted on her marriage rumours

tamannaah reacted on her marriage rumours

Tamannaah: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ నెట్టింట గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా తమన్నా ఆస్తి కోసమే వివాహం చేసుకుంటుందని అతడు ఒక పెద్ద బిజినెస్ మాన్ కావడం వల్లే పెళ్లికి అంగీకరించిందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. కాగా వీటన్నింటికి చెక్ పెడుతూ తమన్నా తను పెళ్లి చేసుకునేది ఇతనేనంటూ తాజాగా ఓ పోస్ట్ చేసింది.

తమన్నా తనపై వస్తున్న పెళ్లివార్తలకు స్పందిస్తూ ఇన్ స్టా గ్రామ్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇతనే నా భర్త బిజినెస్ మాన్ అంటూ ఇటీవల తాను నటించిన ఎఫ్3 సినిమాలోని తమన్నా మగాడి గెటప్ పాత్రకు సంబంధించిన వీడియో క్లిప్ ను కూడా జత చేసింది. ఆ వీడియోకు మ్యారేజ్ రూమర్స్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేసింది ఈ ముద్దుగుమ్మ. తమన్నా ఎఫ్3 సినిమాలో కొన్ని సన్నివేశాలలో మగాడి వేషంలో కనిపించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: ముంబై వ్యాపారవేత్తతో తమన్నా పెళ్లి

Exit mobile version