Site icon Prime9

Samantha: సమంత ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్..!

samantha-manager-gives-clarity-on-her-health-condition she is perfectly healthy

samantha-manager-gives-clarity-on-her-health-condition she is perfectly healthy

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. తాను మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్నానని కొన్ని రోజుల క్రితం సమంత సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా అప్పట్నుంచి సమంత ఆరోగ్యం గురించి అభిమానులు అటు సినీప్రముఖులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ వ్యాధికి శాశ్వత చికిత్స లేదు తరచూ వైద్యం చేయించుకుంటూ సమయానుసారంగా మందులు మింగాల్సిందే.

కాగా సమంత ఇటీవల యశోద ప్రమోషన్స్ లో భాగంగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే కాస్త జోష్ కనపరిచింది. అయితే ఇంతలోనే సమంత గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మయోసైటిస్ కారణంగా సమంత ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుందనే వార్త తమిళనాడులో  తెగ చక్కర్లు కొట్టింది. ఈ వార్త నిజమేనేమోనని ఫ్యాన్స్ అందరూ కంగారు పడ్డారు. ఈ తరుణంలోనే సమంత మేనేజర్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. సమంత ఆరోగ్యం క్షీణించినట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఆమె ఏ ఆసుపత్రిలోనూ చేరలేదని స్పష్టం చేశాడు. సమంత చాలా ఆరోగ్యంగానే ఉందని, ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దని సూచించాడు.

అంతేకాకుండా శ్రీదేవి శ్రీధర్ అనే సినిమా జర్నలిస్ట్ కూడా సమంత ఆరోగ్యంగానే ఉందని ట్విటర్ ద్వారా కన్ఫమ్ చేశారు. ఆమె ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. కాబట్టి సమంత ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఇదీ చదవండి: వీరసింహారెడ్డి మూవీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

Exit mobile version