ఆస్కార్ అవార్డుకు అడుగు దూరంలో ఆర్ఆర్ఆర్ “నాటునాటు సాంగ్”.. షార్ట్ లిస్ట్ జాబితాలో చోటు.. అవార్డు వస్తుందా..!

95వ ఆస్కార్ అవార్డు మీద టాలీవుడ్, తెలుగు ప్రేక్షకులు ఈ సారి చాలా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితా నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ ఎంపిక అయ్యింది.

RRR for Oscars: సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మక అవార్డు అంటే ఆస్కార్ అనే చెప్పాలి. అయితే ఈ ఏడాది జరుగబోయే 95వ ఆస్కార్ అవార్డు రేసులో సత్తాచాటేందుకు నాలుగు భారతీయ సినిమాలు రెడీ అయ్యాయి. ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌లో పోటీ పడనున్న మూవీల షార్ట్‌లిస్ట్‌ను తాజాగా అకాడమీ ప్రకటించింది.

95వ ఆస్కార్ అవార్డు మీద టాలీవుడ్, తెలుగు ప్రేక్షకులు ఈ సారి చాలా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఈ ఏడాది రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కచ్చితంగా ఆస్కార్ అవార్డులు తీసుకొస్తుందని యావత్ దేశ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆస్కార్ అవార్డుల షార్ట్ లిస్ట్ జాబితా నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్‌ ఎంపిక అయ్యింది. దానితో కీరవాణి ఆస్కార్ అవార్డు పొందేందుకు ఒక అడుగు దూరంలోనే ఉన్నారని చెప్పవచ్చు.

ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి కాంబోలో నిర్మితమైన ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి నాటు నాటు సాంగ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పదిహేను బెస్ట్ పాటలతో పోటీ పడనుంది. ఈ పదిహేను పాటల్లోంచి ఒక పాటకు మాత్రమే ఆస్కార్ అవార్డ్ రానుంది. ఈ క్రమంలోనే నాటు నాటు సాంగ్‌కు కచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇండియాకు ఇది ప్రౌడ్ మూమెంట్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇకపోతే సుమారు 10 విభాగాలకు సంబంధించిన షార్ట్ లిస్ట్ జాబితాలో నాలుగు కేటగిరీల్లో భారతీయ సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’, ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటునాటు’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్‌’ ఈ జాబితాలో స్థానం సొంతం చేసుకున్నాయి. ఇక ఈ షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన మూవీలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్‌ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటించనున్నారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చెయ్యనున్నారు.

ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా రాజమౌళికి బెస్ట్ డైరెక్టర్ అనే అవార్డు ఇచ్చింది. అంతే కాకుండా లండన్ క్రిటిక్స్ సర్కిల్ ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డుల్లో ఈ సినిమాకు ఇటీవల ఫారెన్ లాంగ్వెజ్ ఆఫ్ ది ఇయర్, టెక్నికల్ అఛీవ్ మెంట్ అవార్డు అనే రెండు కేటగిరీల్లో అవార్డులు వచ్చాయి. మరి మన తెలుగు సినిమా ఈ సారి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డును కౌవసం చేసుకోవాలి ఆశిద్దాం.

ఇదీ చదవండి: మెగా సినిమాలు ఒకేరోజు రీ రిలీజ్ చేయకూడదనుకున్నాం.. నిర్మాత నట్టికుమార్