Site icon Prime9

Poonakaalu Loading: పూనకాలు లోడింగ్.. మెగా మాస్ సాంగ్‌తో వచ్చిన వాల్తేరు వీరయ్య

poonakalu loading song from chiranjeevi waltair veerayya

poonakalu loading song from chiranjeevi waltair veerayya

Poonakaalu Loading: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’నుంచి వరుస అప్ డేట్స్ మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పూనకాలు లోడింగ్’ సాంగ్‌ను ఎట్టకేలకు వచ్చేసింది. ఈ రోజు మూవీ యూనిట్ ఈ సాంగ్ ను గ్రాండ్ రిలీజ్ చేసింది. ఇకపోతే ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం నెక్ట్స్ లెవెల్‌ అనే చెప్పవచ్చు. మెగా మాస్ స్టెప్స్కు  తగినట్టుగా ఊర మాస్ బీట్ ఇచ్చాడని మెగాస్టార్ ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్లో ఎందుకు అన్నాడో, ఈ పాట వింటే అర్థమవుతుంది. ‘పూనకాలు లోడింగ్’ పాటతో మెగాస్టార్ ఈ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను మరింత పెంచేశారు.

ఇక ఇది మాస్ సాంగ్ కాదు.. మెగా మాస్ సాంగ్ అని దేవిశ్రీ పాట సాంగ్ స్టార్టింగ్లో చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ఈ పాటను రామ్ మిర్యాల, రోల్ రైడా పాడగా.. చిరు తనదైన గ్రేస్ స్టెప్పులతో ఆరుపదుల వయస్సులో పదహారేళ్ల పిల్లాడిలా మరోసారి రెచ్చిపోయి ఆడారు.
ఇదిలా ఉంటే ఈ పాటలో మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. మెగాస్టార్ కూడా ఈ పాటలో తన గొంతును కలిపి ‘‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్..’’ అంటూ ఇచ్చిన వాయిస్ ఈ సాంగ్ కు మరో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక ఈ సాంగ్‌లో మెగాస్టార్, మాస్ రాజాలు కలిసి చేసిన డ్యాన్స్ కు థియేటర్లలో ప్రేక్షకులకు నిజంగానే పూనకాలు తెప్పించడం ఖాయమని తెలుస్తోంది.

poonakalu loading song

ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండగా, మాస్ రాజా రవితేజ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో చేస్తున్న ఈ మూవీలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: ఆ 16 మందినే ఫాలో అవుతున్న ప్రభాస్.. అందులో మేడమ్ కూడా ఉందా..?

 

Exit mobile version