Site icon Prime9

Nikki Galrani: డెలివరీ డేట్ కూడా మీరే చెప్పండి అంటున్న “నిక్కీ గల్రానీ”

nikki-galrani-pinisetty-reveals-if-she-is-pregnant-or-not

nikki-galrani-pinisetty-reveals-if-she-is-pregnant-or-not

Nikki Galrani: ప్రెగ్నెంట్‌ అంటూ తనపై వస్తోన్న వార్తలపై కోలీవుడ్ ప్రముఖ నటి నిక్కీ గల్రానీ స్పందించారు. ఆమె గర్భం దాల్చిందని, త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ తరుణంలో వాటిపై నిక్కీ స్పందించారు. అవి రూమర్లంటూ కొట్టిపడేశారు. ‘డెలివరీ డేట్ కూడా మీరే చెప్పేయండి’ అంటూ నవ్వుల ఎమోజీని పోస్టు చేశారు. ఇలాంటి రూమర్లను నమ్మొద్దని, ఏదైనా ఉంటే తానే స్వయంగా వెల్లడిస్తానని చెప్పుకొచ్చారు ఈ ముద్దుగుమ్మ.

‘కృష్ణాష్టమి’, ‘మలుపు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిక్కీ గల్రానీ, స్టార్ హీరో అయిన ఆది పినిశెట్టిని ఈ ఏడాది మేలో వివాహం చేసుకున్నారు. ఇకపోతే నిక్కీ, ఆది వివాహంతో ఒక్కటి కావడానికి రెండేళ్ల ముందునుంచే డేటింగ్‌లో ఉన్నారు. పలుమార్లు వీరిద్దరూ బహిరంగంగానే కనిపించినప్పటికీ తాము మంచి స్నేహితులుగానే చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొద్దిరోజులకు వీరు ఇరువురు పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇదీ చదవండి: నా మనసు గాల్లో తేలుతోంది.. సమంత

Exit mobile version