Site icon Prime9

Jr NTR: పేరు మార్పు వైఎస్సార్ స్థాయిని పెంచదు.. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు.. జూనియర్ ఎన్టీఆర్

jumior ntr

jumior ntr

Tollywood: హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు పై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకరి పేరు తీసి ఇంకొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం. వైఎస్ఆర్ స్థాయిని పెంచదని, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని చెప్పారు.

ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెట్టే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. తాత పేరు మార్చినప్పటికీ జూనియర్ స్పందించడా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో ఎన్టీఆర్ ఈ ట్వీట్ చేసారు.

అయితే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హెల్త్‌ వర్శిటీ పేరును తిరిగి మార్చుతామంటూ టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అంటే తమకు గౌరవం ఉందని వైద్య రంగంలో తాము విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకే వైఎస్ పేరు పెట్టామని సీఎం జగన్ సహా వైసీపీ నేతలు చెబుతున్నారు.

Exit mobile version