Site icon Prime9

Mahesh Babu: “మీతోనే నా ధైర్యం వెళ్లిపోయిందంటూ..” మహేష్ భావోద్వేగ పోస్ట్

mahesh-babu-emotional-post-about-father-krishna

mahesh-babu-emotional-post-about-father-krishna

Mahesh Babu: సినీ పరిశ్రమలో లెజెండరీ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 15వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక కృష్ణ మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అంతేకాకుండా మరోపక్క తెలుగు ఇండస్ట్రీ కూడా ఆయన మరణాన్ని జీర్ణంచుకోలేకపోతుంది. ఇకపోతే విజయవాడలోని కృష్ణా నదిలో తన తండ్రి అస్థికలను మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.

అయితే తాజాగా తండ్రిని లేని లోటును జీర్ణించుకోలేక మహేష్ సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను తలుచుకుంటూ తను ట్విట్టర్ ద్వారా భావోద్వేగానికి లోనయ్యారు. “మీ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపారు. మీరు వెళ్లిపోవడం కూడా అంతకన్నా గొప్పగా జరిగింది. అదే మీ గొప్పతనం మీ జీవితాన్ని మీరు నిర్భయంగా గడిపారు. డేరింగ్ అండ్ డాషింగ్ మీ నైజం. నా స్పూర్తి, నా ధైర్యం మీలో నేను చూసుకున్నవన్నీ మీతేనే వెళ్లిపోయాయి. కానీ ఇప్పుడు నాలో మరోకొత్త శక్తిని అనుభవిస్తున్నాను. నేను ఇప్పుడు నిర్భయంగా ఉన్నాను. మీలోని వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తుంది. మీ లెగసీని నేను ముందుకు తీసుకెళ్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్ యూ నాన్న” అంటూ భావోద్వేగమైన పోస్ట్ ను షేర్ చేశారు మహేష్. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు మహేష్ ను ఓదార్చుతున్నారు. కష్టకాలంలో ఆ దేవుడు మహేష్ కు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరిలో “ధమ్కీ” ఇవ్వనున్న విశ్వక్ సేన్

Exit mobile version