Site icon Prime9

Prabhas: ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా.. కృతిసనన్ క్లారిటీ

Kriti sanon wants to marry Prabhas if she gets chance

Kriti sanon wants to marry Prabhas if she gets chance

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా కాలం గడుపుతున్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్న ఈ రెబల్ స్టార్ ఇటీవల తన సినిమాలో సీత అయిన కృతిసనన్ తో ప్రేమలో పడినట్టు బాలీవుడ్ కోడై కూస్తోంది. ‘ఆదిపురుష్’ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని టాక్ వినిపిస్తోంది. కాగా తాజాగా ఈ అంశంపై కృతి స్పందించింది.

ఒకవేళ నాకు ఆ ఛాన్స్ వస్తే ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని కృతి చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంకోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావణ్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు.ప్రభాస్ జీవితంలో కొత్త డార్లింగ్ ఉందని ఆయన అన్నారు. ప్రభాస్, కృతి ఇద్దరిదీ అందమైన జంట అని కితాబిచ్చాడు. ఇప్పడు ప్రభాస్, కృతిల వ్యవహారం సినీ ఇండస్ట్రీ నాట హాట్ టాపిక్ గా మారింది.

ఇదీ చదవండి: కాంతారకు ఊరట.. వరాహరూపం సాంగ్ ఈజ్ బ్యాక్

Exit mobile version