Site icon Prime9

Sai Pallavi: సినిమాలకు సాయిపల్లివి గుడ్ బై.. షాక్ లో అభిమానులు

Is heroine-sai-pallavi-good-bye-to-movies

Is heroine-sai-pallavi-good-bye-to-movies

Sai Pallavi: సాయిపల్లవి ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలో స్టార్ హీరోలను మించి ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న బ్యూటీ. సాయిపల్లవికి మంచి క్రేజ్ ఉంది దానితో ఆమెను లేడీ పవర్ స్టార్ అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకుంటారు. అంత స్టార్ డమ్ ఉన్న ఈ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో తాను సినిమాలకు గుడ్ బై చేప్పబోతుందట.

సాయి పల్లవి అంటే ప్రత్యేక గుర్తింపు. ఆమె అందరు హీరోయిన్లలా కాదు. కేవలం గ్లామర్‌ పాత్రలు కాకుండా నటనాప్రాధాన్యం ఉన్న సినిమాలకే ఆమె మొగ్గు చూపుతూ తనకంటూ ఓ స్పెషల్ మార్క్ ను క్రియేట్ చేసుకుంది ఈ మళయాల బ్యూటీ. అందుకే చాలా తక్కువ సినిమాలు చేసినా.. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది సాయిపల్లవి. ఇక ఈ ఏడాది విరాటపర్వం, గార్గి సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సాయిపల్లవి కొంతకాలంగా ఏ సినిమాలను ఒప్పుకోవడం లేదు. స్టార్‌ హీరోల పక్కన హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించినట్టు ఇండస్ట్రీ టాక్. దీంతో సాయిపల్లవి సినిమాలను వదిలేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ విన్న సాయి పల్లవి అభిమానులు షాక్ అవుతున్నారు.

ఇకపోతే సాయిపల్లవి యాక్టర్ కాకముందు డాక్టర్‌, అంతకంటే ముందు డాన్సర్. జార్జియాలో ఎంబీబీఎస్ చదివిన సాయిపల్లవి, ఇండియా వచ్చి డాన్స్ మీద ఇంట్రెస్ట్ తో నటన మీద ప్రేమతో హీరోయిన్ గా మారింది. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్‌ హీరోయిన్‌గా మారింది. కాగా ఇకపై తన వృత్తికి కూడా ఆమె న్యాయం చేయాలి అనుకుంటుందట. దాని కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటుందట సాయి పల్లవి. అందుకే నటనకు గుడ్ బై చెప్పి, డాక్టర్ గా సెటిల్ అవ్వబోతున్నట్టు సినీపరిశ్రమ కోడై కూస్తోంది. అందుకే కోయంబత్తూర్‌లో సొంతంగా ఒక హాస్పిటల్‌ను నిర్మిస్తోందట సాయి పల్లవి. ఈ ఆస్పత్రిని తన చెల్లెలు పూజా కలిసి చూసుకోబోతుందని అందుకే సినిమాలను వదిలేయాలని అనుకుంటున్నట్టుగా టాక్‌ వినిపిస్తోంది. మరి ఈ న్యూస్ లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే సాయిపల్లవి నోరువిప్పాల్సిందే.

ఇదీ చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే

Exit mobile version