Site icon Prime9

Sai Pallavi: పుట్టపర్తి సాయిపల్లవి సందడి.. ప్రశాంతి నిలయంలో న్యూయర్ సెలబ్రేషన్స్

sai pallavi at puttaparthi prashanthi nilayam

sai pallavi at puttaparthi prashanthi nilayam

Sai Pallavi: తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో మంచి పేరును క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తనదైన అందం, నటనతో దక్షిణాది ప్రేక్షకల మనసుదోచుకుంది ఈ ముద్దుగుమ్మ. కాగా గత కొద్ది రోజులుగా హీరోయిన్ సాయి పల్లవి పెద్దగా స్క్రీన్ పై కనిపించడం లేదు. ఆమె ఇటీవల సినిమాలేమి ఒప్పుకోకుండా మీడియాలో కనిపించకుండా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాగా చివరిసారిగా సాయి పల్లవి విరాటపర్వం, గార్గి, సినిమాలో నటించారు. అప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియాలో ఇంటర్వ్యూలు సరదా చిట్ చాట్లు చేస్తూ కనిపించింది. ఆ తర్వాత సాయి పల్లవి సినిమాలకి దూరం తన వైద్యవృత్తిలోనే కొనసాగనున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. అయితే వీటిపై సాయి పల్లవి నుంచి మాత్రం స్పందించన రాలేదు.

తాజాగా సాయి పల్లవి పుట్టపర్తిలో కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు దైవ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో సాయి పల్లవి పాల్గొంది. సాంప్రదాయబద్ధంగా చీరలో సాధారణ భక్తుల్లాగే వచ్చి అందరి మధ్యలో కూర్చొని సాయిబాబా దైవ చింతనలో తన నూతన సంవత్సర మొదటి రోజుని గడిపింది. ఇక సాయి పల్లవి పుట్టపర్తిలో కనపడటంతో కొంతమంది సెల్ ఫోన్స్ లో చిత్రీకరించారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి.

మరి సాయి పల్లవి సినిమాల్లో కనిపిస్తుందా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై సాయి పల్లవి క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Exit mobile version