Site icon Prime9

Hari Hara Veeramallu: “హరిహర వీరమల్లు” నుంచి స్పెషల్ మెస్సేజ్.. ఫొటోలు వైరల్

hari-hara-veera-mallu-team-drops-special-message photos goes viral

hari-hara-veera-mallu-team-drops-special-message photos goes viral

Hari Hara Veeramallu: ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులతోపాటు సినీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు. చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర షూటింగ్‌పై ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌ ఇస్తూ ఉన్నారు మేకర్స్. అయితే తాజాగా ఓ సందేశాన్ని మరియు కొన్ని ఫొటోలను హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు టీం నెట్టింట ప్రేక్షకులతో పంచుకుంది.

“చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా ఈ సినిమాతో సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. ఈవెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం”. అంటూ చిత్ర బృందం రాసుకొచ్చింది. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ లొకేషన్‌లో డైరెక్టర్ క్రిష్‌ మానిటర్‌ చెక్‌ చేసుకుంటున్న స్టిల్‌తోపాటు మరోవైపు పవన్‌ కల్యాణ్‌, క్రిష్‌ టీం సెట్స్‌లో చర్చించుకుంటున్న ఫొటోలు నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.

ఇదీ చదవండి: “మీతోనే నా ధైర్యం వెళ్లిపోయిందంటూ..” మహేష్ భావోద్వేగ పోస్ట్

Exit mobile version