Site icon Prime9

Mega Star Chiranjeevi: “వాల్తేర్ వీరయ్య” బాస్ పార్టీ గ్లింప్స్ వీడియో

first-single-glimpse-from-chiranjeevi-waltair-veerayya

first-single-glimpse-from-chiranjeevi-waltair-veerayya

Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా నుంచి రేపు (నవంబరు 23)  ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నేడు ఆ పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది.

“వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ.. బాస్ పార్టీ” అంటూఈ హుషారైన పాటను మొదలవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ “నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడి వేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో.. బాస్ వస్తుండు, బాస్ వస్తుండు” అంటూ పక్కా మాస్ పదజాలాన్ని వాడడం ఈ ప్రోమో వీడియోలో చూడొచ్చు.

ఈ సినిమాకు ఇది టైటిల్ సాంగ్ అయ్యి ఉంటుందని అంటున్నారు సినీ లవర్స్. ఈ పాటను నకాష్ అజీజ్, హరిప్రియలతో కలిసి దేవిశ్రీ ప్రసాద్ ఆలపించారు. కాగా ఈ పాటను దేవిశ్రీనే రచించారు. ఇదిలా ఉంటే ఈ పాటలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మెగాస్టార్ సరసన స్టెప్పులేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: ఆసుపత్రి బెడ్ పై “ప్రేమదేశం హీరో అబ్బాస్”.. ఏమైందంటూ అభిమానుల ఆందోళన

 

Exit mobile version