Site icon Prime9

Dhamki: ఫిబ్రవరిలో “ధమ్కీ” ఇవ్వనున్న విశ్వక్ సేన్

dhamki-movie-release-date-confirmed

dhamki-movie-release-date-confirmed

Dhamki: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా ‘ధమ్కీ’ సినిమా రూపొందుతోంది. సొంత బ్యానర్లో ఈ సినిమాకి విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇటీవలే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక శ్రీమంతుడికి ఎదురైన సమస్యను, ఒక సాధారణమైన వెయిటర్ ఎలా పరిష్కరించాడనేదే ఈ సినిమా కథ.

అయితే తాజాగా కొంతసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర యూనిట్. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నట్టుగా చెబుతూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ అలరించనుంది. ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్, రోహిణి, అజయ్ కనిపించనున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించిన ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు.

ఇదీ చదవండి: సమంత ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్..!

Exit mobile version