Site icon Prime9

Rashmika Mandanna: “శ్రీవల్లి” చీరకు భారీ డిమాండ్.. నార్త్ లోనూ రష్మిక క్రేజ్..!

srivalli saree demand

srivalli saree demand

Tollywood: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్‌గా నటించి సూపర్ హిట్ కొట్టిన చిత్రం పుష్ప. కాగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా నేపథ్యంలో విడుదల చేసి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన విషయం విధితమే. బాలీవుడ్‌లో ఈ సినిమా రూ.100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దానితో బన్నీ, రష్మికల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రంలోని పాటలు భారీ విజయాన్ని సాధించాయి. పలు ప్రాంతాల్లో ఈ సాంగ్స్ ఇప్పటికీ మారుమోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘శ్రీవల్లీ’ పాటకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. నెటిజన్స్ అప్పట్లో రీల్స్ చేసి హల్‌చల్ చేశారు. పుష్ప సినిమా విడుదలై 9నెలలు గడుస్తున్నా ఈ పాటకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అయితే “రారా సామి” పాటలో రష్మిక ధరించిన చీరకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ శారీని కొనడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

“రారా సామి” పాటలో రష్మిక ఎరుపు రంగు చీర ధరించి స్టెప్పులు అదరగొట్టింది. కాగా ఆ చీర పై మహిళలు ఆసక్తి కనపరుస్తుండడంతో జైపూర్‌లోని ఓ దుకాణం శ్రీవల్లీ పాటలోని చీరకు దగ్గరి పోలికలున్న శారీని అమ్మకానికి పెట్టింది. కాగా ఆ చీరలన్నీ అమ్ముడుపోయాయంట. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. రష్మిక మందన్న అభిమానులు కూడా ఈ పిక్స్‌ను షేర్ చేస్తున్నారు.

త్వరలో రష్మిక ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’సినిమాలతో బాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. దానికి సంబంధించి ఆ షూటింగ్స్‌ను ఇప్పటికే పూర్తి చేసింది. కాగా ఈ చిత్రాలు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇదీ చదవండి:  దేశంలోనే టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ప్రభాస్..!

Exit mobile version