Site icon Prime9

Waltair veerayya: మాస్ లుక్‎లో చిరంజీవి.. వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్ రిలీజ్

chiranjeevi-waltair-veerayya-boss party mass-song-released

chiranjeevi-waltair-veerayya-boss party mass-song-released

Waltair veerayya: మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి బాస్ పార్టీ (Boss Party) అంటూ తొలి పాటను విడుదల చేశారు చిత్రబృందం. ఈ సాంగ్ చిత్రీకరణకు గానూ హైదరాబాద్ సిటీ శివార్లలో భారీ సెట్‌ వేసి స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ పాటలో హిందీ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా చిరంజీవితో కలిసి చిందేసింది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకానున్నట్లు ప్రకటించింది టీమ్. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ పాటలో చిరంజీవి లుంగీలో ఊర మాస్ గెటప్‌లో ఓ రేంజ్‌లో కనిపించారు. అభిమానులు చాలా కాలం తర్వాత చిరంజీవి మాస్ కటౌట్‌ చూసి తెగ సంబరపడుతున్నారు. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయినట్టు సమాచారం. దీంతో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను స్టార్ట్ చేశారు. ఇక వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ సుమలత కనిపించనున్నారట. చిరంజీవి డ్యుయల్ రోల్‌లో కనిపించనున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఇదీ చదవండి: నెట్టింట వైరల్ అవుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్.. ఎందుకో తెలుసా..?

Exit mobile version