Site icon Prime9

Megastar Chiranjeevi: జోష్ మీదున్న మెగాస్టార్‌.. ఫ్యామిలీతో విహారయాత్ర.. హీరోయిన్‌తో వీరయ్య యాత్ర

chiranjeevi-shares-post-about-family-trip-pic-and-photo-with-shruti-haasan-europe-trip

chiranjeevi-shares-post-about-family-trip-pic-and-photo-with-shruti-haasan-europe-trip

Megastar Chiranjeevi: హిట్టూ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజిబిజీగా గడిపేస్తున్న మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. అదే జోష్ ను కొనసాగిస్తూ ప్రస్తుతం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కె.ఎస్‌.రవీంద్ర (బాబ్జీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్‌ ఊరమాస్‌ లుక్ లో కనిపించనున్నారు. దానికి తగ్గట్లే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌ మెగా ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ మెగా మూవీ సంక్రాంతి బరిలో జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కానున్నట్టు వెల్లడించింది చిత్రబృందం.

కాగా వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కోసం తాజాగా మెగాస్టార్ చిరంజీవి విదేశాలకు బయలుదేరాడు. ఆయనతో పాటు సతీమణి సురేఖ, కూతురు సుష్మిత పిల్లలు కూడా వెళ్లారు. అయితే తన ఫారిన్‌ ట్రిప్‌ విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేస్తూ మెగాస్టార్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఓ వైపు ఫ్యామిలీతో మరోవైపు షూటింగ్‌ కోసం శృతిహాసన్‌తో కలిసి ఫారిన్ వెళుతున్న ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు చిరు. ఫొటోతో పాటు ‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర..’ అంటూ క్యాప్షన్ కూడా జోడించారు మెగాస్టార్.

వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో శ్రుతిహాసన్‌ జోడి కట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని చెప్పారు మూవీ మేకర్స్. కాగా వాల్తేరు వీరయ్య షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. తాజాగా ఈ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ కోసం చిరంజీవి, శ్రుతి హాసన్ తో పాటు చిత్ర యూనిట్ యూరప్ వెళ్లింది. అక్కడి సుందరమైన లోకేషన్స్ లో రెండు పాటలని చిత్రీకరించనున్నారు మూవీ మేకర్స్. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ఫస్ట్ సింగల్ ‘బాస్ పార్టీ’.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చదవండి: త్వరలో మెగాస్టార్ – పూరీ మూవీ

Exit mobile version