Site icon Prime9

Megastar Chiranjeevi: చిరంజీవిని వరించిన మరో అరుదైన అవార్డ్

chiranjeevi-elected-indian-film-personality-of-the-year 2022-award

chiranjeevi-elected-indian-film-personality-of-the-year 2022-award

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని మరో అరుదైన అవార్డు వరించింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని చిరు కౌవసం చేసుకున్నారు. ఈ అరుదైన గౌరవాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

గోవాలో ఇఫీ చలనచిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సినీ ప్రముఖులకు పురస్కారాలు అందిస్తున్నారు. కాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఏడాది ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు ఈ గౌరవం ఇవ్వడం ఎంతో సంతోషం కలిగించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి మరియు తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిరంజీవి వివరించారు.
అంతకుముందు, చిరంజీవిని ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022గా ప్రకటిస్తూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు. తెలుగు సినిమా రంగంలో చిరంజీవి విశేష ప్రజాదరణ పొందారని, హృదయాలను కదిలించే నటనాప్రతిభ ఆయన సొంతమని కొనియాడారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు కేంద్రమంత్రి.

ఇదీ చదవండి: హీరో నాగశౌర్య పెళ్లైపోయింది.. ఫొటోలు, వీడియోలు వైరల్

Exit mobile version