Site icon Prime9

Bimbisara-OTT-Release: బింబిసార ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది !

bimbisara-ott-release

Bimbisara-OTT-Release: ” బింబిసార ” సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టరుగా నిలిచింది. బ్లాక్‌బాస్టర్ హిట్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా బాక్సాఫీసు వద్ద ఫుల్ రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త ఆప్టేట్ వచ్చింది . ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.  నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా.. కొత్త దర్శకుడు వ‌శిష్ఠ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా బింబిసార. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల అయింది . ఈ ఏడాది టాలీవుడ్‌లో ఈ సినిమా బిగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా థియేటర్స్‌లో ఫుల్ రన్ అవుతోంది. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే రూ.70 కోట్లపైగా కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. కళ్యాణ్ రామ్ తన సినిమా కెరీర్‌యలో సూపర్ హిట్ చిత్రాలలో టాప్‌లో నిలిచింది ఈ సినిమా . ఓటీటీ డేట్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్‌లో చూడలేకపోయివారు ఓటీటీలో ఎప్పుడు వస్తుందని అందరూ అడుగుతున్నారు.

తాజాగా బింబిసార సినిమాను ఓటీటీ రైట్స్ జీ5 దక్కించుకున్నట్లు వార్తలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజం ఐతే సెప్టెంబర్ 15 లేదా 16 తారీఖుల్లో మీ ముందుకు బింబిసార రానున్నది . ఈ రెండు తేదీల్లో ఒక డేట్‌ ఫిక్స్ అవుతుందని తెలిసిన సమాచారం. ఇటీవలె ఒక క్రొత్త రూల్ ప్రవేశ పెట్టింది. థియేటర్‌ రిలీజ్‌కు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు 8 వారాల గ్యాప్ కచ్చితంగా ఉండాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ నిర్ణయించుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. బింబిసార ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. థియేటర్లోనే కాకుండా డిజిటల్గా కూడా మంచి రేటుకు అమ్ముడుపోయిందని తెలుస్తుంది. ఈ మూవీ డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ రూ.15 కోట్ల వరకు అమ్ముడుపోయినట్లు తెలిసిన సమాచారం.

హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో 500 బి.సి కాలంలో త్రిగ‌ర్తల రాజ్యంలోని స‌రిహ‌ద్దున నివసించిన బింబిసారుడు కథ ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా కేథరిన్ మరియు సంయుక్త మీనన్‌ ఇద్దరూ నటించారు . నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై హ‌రికృష్ణ.కె ఈసినిమాను నిర్మించారు. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏదైనా ఉంది అంటూ అది ఇదే . అంచనాలను కూడా ఊహకందని విధంగా వసూళ్లు రాబట్టడం పెద్ద విశేషం. ఈ సినిమాకు బింబిసార పార్ట్ 2 కూడా రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలిసిన సమాచారం.

Exit mobile version