Site icon Prime9

Animal Movie : రణబీర్ కపూర్ – సందీప్ రెడ్డి “యానిమల్” టీజర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్ గురూ !

ranbir kapoor and sandeep reddy animal movie teaser released

ranbir kapoor and sandeep reddy animal movie teaser released

Animal Movie : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ మూవీలో చేస్తుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. బబ్లూ పృథ్వీరాజ్, తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.  భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ పతాకాలపై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ టీజర్ చూస్తే.. సందీప్ చెప్పినట్టుగానే ఒక రేంజ్ వైలెన్స్ ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో.. డిసెంబర్ 1న సినిమా విడుదల కానుంది.

కాగా ముందుగా ప్రకటించిన ప్రకారం ఇప్పటికే వరుసగా (Animal Movie) ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తుండగా.. తాజాగా నేడు రణబీర్ పుట్టినరోజు సందర్భంగా ఫుల్ టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే తండ్రి – కొడుకుల బండింగ్ గురించి ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. అనిల్ కపూర్ రణబీర్ కి తండ్రిగా కనిపించారు. ఇక టీజర్ లో ఒక మోస్తరు యాక్షన్ చూపించి సినిమాలో వియోలెన్స్ ఎలా ఉండబోతుందో ఒక చిన్న హింట్ ఇచ్చాడు సందీప్. అయితే ఈ టీజర్ లో హీరో క్యారెక్టర్ ని కొంచెం సస్పెన్స్ గానే పెట్టాడు దర్శకుడు. మొత్తానికి టీజర్ అయితే ఆకట్టుకునేలానే ఉంది. చివర్లో బాబీ డియోల్ కూడా కూల్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి క్యారెక్టర్ లో వేరియేషన్స్ అర్దం అవుతున్నాయి.

అలానే ముఖ్యంగా డైలాగ్స్ కూడా సందీప్ స్టైల్లో బోల్డ్ అండ్ ఇంటెన్స్ గా ఉన్నాయి. ముందుగా పిల్లల గురించి ఆలోచిస్తున్నావా అని రష్మిక ప్రశ్నిస్తుంది. అవును.. నేను తండ్రి కావాలనుకుంటున్నా అని రణబీర్ బదులిస్తాడు. అయితే నీ తండ్రిలా నువ్వు కాకూడదు అనుకుంటున్నావు కదా అని రష్మిక అడుగుతుంది. నా తండ్రి ప్రపంచంలోనే గొప్ప తండ్రి.. ఆ విషయం గురించి మాట్లాడకు అని సీరియస్ గా అంటాడు.  ఆ తర్వాత రణబీర్ రష్మికతో.. గీతాంజలి నన్ను నువ్వు ఏమైనా అడగొచ్చు.. పోర్న్ చూస్తావా, అమ్మాయిలు వంగితే చూస్తావా ఇలా ఏమి అడిగినా నేను జెన్యూన్ గా సమాధానం ఇస్తా. కానీ ఇది మాత్రం అడగొద్దు అని అంటాడు. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ గా మారింది.

 

Exit mobile version