Site icon Prime9

Ram Charan : ముంబై సిద్ధివినాయక ఆలయంలో చరణ్ మాల విరమణ.. నెక్స్ట్ ధోనీతో ఘాట్

Ram Charan in mumbai siddi vinayaka temple and with ms dhoni

Ram Charan in mumbai siddi vinayaka temple and with ms dhoni

Ram Charan :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. కాగా రామ్ చరణ్ సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తారో బయట అందుకు భిన్నంగా ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా ఉంటారు. అయ్యప్ప స్వామికి రామ్ పెద్ద భక్తుడు అని తెలిసిందే. ప్రతీ సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసి దీక్షను తీసుకుంటుంటారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘గేమ్ ఛేంజర్’ లాంటి  భారీ సినిమాల్లో నటించే సమయంలోనూ ఆయన దీక్షను తీసుకున్నారు. గతంలో ‘ఆర్ఆర్ఆర్’  సినిమాను ప్రమోట్ చేయడానికి అయ్యప్ప స్వామి మాలలోనే రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. అక్కడ ఓ హిందూ ఆలయంలో మాల విరమణ చేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముంబై సిద్ధి వినాయక ఆలయంలో దీక్ష విరమించిన చరణ్.. 

ఇప్పుడు కూడా ఆయన  ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప దీక్షను తీసుకున్నారు. తాజాగా రామ్ చరణ్ చేపట్టిన 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్ష తాజాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ముంబైలోని సిద్ధివినాయక ఆలయంలో అయ్యప్ప మాలను తీశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. సిద్ధి వినాయకుని ఆలయంలోకి వెళ్లిన సమయంలోనూ ఆయన ఇదే నియమాలను ఆచరించారు. ఆలయంలో రామ్ చరణ్ సింప్లీసిటీని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. మాల విరమణ అనంతరం చెర్రీ..  భారత్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ధోనీతో కలిసి ఓ యాడ్ షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

 

 

 

 

 

ఎయిర్ పోర్టులో కాళ్లకు చెప్పులు లేకుండా చెర్రీ (Ram Charan).. 

అంతకు ముందు యాడ్ షూట్ కోసం రామ్ చరణ్ ముంబై ఎయిర్‌పోర్టులో దిగి కాళ్లకు చెప్పులు లేకుండానే బయటకు వచ్చారు. ముంబై ఎయిర్‌పోర్టులో రామ్ చరణ్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయ్యప్ప మాలలో ఉన్నన్ని రోజులు నలుపు రంగు దుస్తులను ధరిస్తారు. చెప్పులను ధరించరు అని తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్.. దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలానే అంజలి, శ్రీకాంత్, సునీల్, SJ సూర్య, నవీన్ చంద్ర, సముద్రఖని, అనన్య సహా పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

 

 

Exit mobile version