Site icon Prime9

Tollywood: మ‌హేష్ బాబుతో చేయబోతున్న సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి

mahesh prime9news

mahesh prime9news

Tollywood: సూపర్‌స్టార్ మ‌హేష్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో కొత్త ప్రయోగానికి సిద్దామయ్యారనే చెప్పుకోవాలి.మహేష్ బాబు ఆయ‌న అభిమానులు ఒక్కటే కాదు తెలుగు సినీ అభిమానులందరు ఆయన సినిమాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ చేయబోయే భారీ సినిమాలు మ‌హేష్ రెండు వాటిలో మొదటిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.ఈ సినిమా చేసిన అనంతరం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ ఓ సినిమా చేస్తున్నారన్న విషయం మన అందరికీ తెలిసిందే. సూప‌ర్ స్టార్ మహేష్ కెరియర్లో ఈ సినిమా 29 వ సినిమాగా మన ముందుకు రానుంది.ఈ సినిమా కథను రాజమౌళి మరియు ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఇద్దరూ కలిసి సిద్దం చేస్తున్నారని తెలిసిన సమాచారం.

రాజమౌళి టోరంటో ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు అటెండ్ అయి తరువాత చేయ‌బోతున్న సినిమా గురించి ఆయన ఈ విధంగా స్పందించారు.మ‌హేష్‌తో నేను తీయబోయే సినిమా గ్లోబ‌ల్ మూవీగా యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ జోన‌ర్‌లో ఈ సినిమా ఉండబోతుందని ఆయ‌న ఫెస్టివల్ ఈవెంటులో వెల్లడించారు.రాజ‌మౌళి సినిమా తీసే విధానం ఏ రేంజులో ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే.ఐతే జక్కన్న మహేష్ బాబుతో సరి కొత్త ప్రయోగానికి సిద్దమయ్యారనే చెప్పుకోవాలి.ఇంత కాన్ఫిడెంట్ గా జక్కన్న చెప్పారంటే ఇంకా ఆయన చేసే యాక్షన్ సినిమా ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి.ఈ సినిమా వచ్చే ఏడాది మొదటిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుందని తెలిసిన సమాచారం.

Exit mobile version