Site icon Prime9

AHA: ఆహాలో అనిల్ రావిపూడి సందడి.. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ షో ప్రోమో రిలీజ్

comedy-stock-exchange-promo-released

comedy-stock-exchange-promo-released

AHA: అన్ స్టాపబుల్ షోతో ‘ఆహా’ క్రేజ్ పెరిగిపోయిందని చెప్పాలి. దానితో ఆహా కొత్తకొత్త షోలు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పెంచేందుకు యత్నిస్తున్నారు. ఒక వైపున సినిమాలు, మరో వైపున వెబ్ సిరీస్ లు, ఇంటోవైపు టాక్ షోలు అంటూ నెటిజన్లకు కావలసిన ఎంటర్టయిన్మెంట్ ను పుష్కలంగా అందిస్తుంది ఆహా. అయితే తాజాగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి న్యాయనిర్ణేతగా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షోను అందించడానికి రంగం సిద్ధమైంది.

ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే, ఇంతవరకూ ఆయన చేసిన సినిమాలన్నీ హిట్లే. అన్ని సినిమాల్లోను కామెడీ పరంగానే ఆయనకి ఎక్కువ మార్కులు దక్కాయి. కామెడీపై ఆయనకి మంచి పట్టు ఉందనే విషయాన్ని ఆయన సినిమాలే నిరూపించాయి. అందువలన ఈ కామెడీ షో కోసం అనిల్ ని న్యాయ నిర్ణేతగా తీసుకున్నారు.
Comedy Stock Exchange Episode 1 Promo | Anil Ravipudi, Sudigali Sudheer, Deepika Pilli | ahaVideoIN

ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ డిసెంబర్ 2న స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, అందుకు సంబంధించిన ‘ప్రోమో’ను విడుదల చేసింది ఆహా టీం. దీనికి సుడిగాలి సుధీర్, దీపికా పిల్లై యాంకర్స్ గా వ్యవహరిస్తుండగా, ‘జబర్డస్త్’, ‘పటాస్’ షోస్ ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ సందడి చేయనున్నారు.

ఇదీ చదవండి: మహేష్ ఈజ్ బ్యాక్.. త్వరలో షూటింగ్ సెట్స్ పై ప్రిన్స్

Exit mobile version
Skip to toolbar