Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ ఈ కన్నడ పవర్ స్టార్ అటు కోలీవుడ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్ ప్రజలకు కూడా సుపరిచితమే. ఈయన తన నటనతోనే కాకుండా తనదైన గొప్ప మానవతా గుణంతోనూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తి ఒక్కసారిగా జిమ్ చేస్తూ గత ఏడాది తుదిశ్వాస విడిచారు. ఆయన చేసిన అనేక సేవలకు గుర్తుగా కన్నడ ప్రభుత్వం ఇటీవలె ఆయనకు కర్ణాటక రత్న అనే బిరుదును కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ సిలబస్‌లో కర్ణాటక రత్న, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని నిర్ణయించింది. పునీత్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు తాము ఆ దిశగా ఆలోచన చేస్తున్నామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
పునీత్ రాజ్‌కుమార్ వందలాది మంది నిరుపేద విద్యార్థులను, అనాధలను తన సొంత ఖర్చుతో చదివించా్రని పేర్కొన్నారు. పేదలకు సహాయం చెయ్యడంలో ఆయనో గొప్ప మానవతా మూర్తిగా నిలిచారని, ఆయన జీవితచరిత్ర నుంచి విద్యార్థులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్ణాటకకు చెందిన పలువురు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేశారు. పునీత్ రాజ్‌కుమార్ నేత్రదానాన్ని, స్వయం ప్రేరిత రక్తదానాన్ని పోత్సహించారని, ఎన్నో వృద్ధాశ్రమాలకు అండగా నిలిచారని పునీత్ అభిమానులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ముఖం నిండా సూదులతో.. టాలీవుడ్ హీరోయిన్ వైరల్ ఫొటో