Site icon Prime9

Samantha: యువరాణి పాత్రలో కనిపించనున్న సమంత

samantha 2 prime9news

samantha 2 prime9news

Bollywood: తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అభిమానులకు ఇప్పటికి జెస్సి లాగా కనిపిస్తుంది. ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దక్షిణాదిలో సమంత కొన్నేళ్ళ నుంచి అగ్రతారగా నిలిచింది. ఈమె సినిమాలు మాత్రమే కాకుండా పలు వెబ్ సిరీస్ ల్లో నటించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఇప్పుడు సమంతా పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు పొందియున్నారు.

“ది ఫ్యామిలీ మెన్ 2″ వెబ్ సిరీస్ లో సమంత నటించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విషయం మన అందరికి తెలిసిందే. వెబ్ సిరీస్ విజయంతో హిందీలో పలు సినిమాలను ఓకే చేస్తున్నట్లు తెలిసిన సమాచారం.ప్రస్తుతం ఆమె కొత్త సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. సమంత తొందరలోనే బాలీవుడ్ బిగ్ స్క్రీన్ మీద మెరవనుందని తెలిసింది.

ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఓ హారర్ కామెడీ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమాలో సమంత ఓ యువరాణి పాత్రలో కనిపించనున్నారని బాలీవుడ్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా ఓ డ్రాక్యూలా పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారు.

Exit mobile version