Site icon Prime9

Crime News:వరుసకు అన్న.. బాలికను తల్లిని చేశాడు

crime news in bihar

crime news in bihar

Crime News: వారిరువు వరుసకు అన్నా చెల్లెళ్లు. ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే. పాఠశాలకు వెళ్లివస్తోన్న క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దానితో బాలిక గర్భం దాల్చింది. తీరా చూస్తే ఏడునెలల గర్బం అని తెలిసి భయపడి పారిపోయి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ ఉదతం బిహార్లో చోటుచేసుకుంది.

బిహార్‌లో దారుణం చోటుచేసుకుంది. వరుసకు అన్నాచెల్లెళ్లు కానీ ఆ యువతిని తల్లిని చేశాడు ఆ యువకుడు. పక్కపక్క ఇళ్లలోనే ఉండే బాలిక(15), బాలుడు(15) కలిసి చదువుకుంటున్నారు. ఆ చనువుతో దగ్గరయ్యారు. వరుసకు అన్నా చెల్లెళ్లు కావడంతో కుటుంబ సభ్యులూ ఎటువంటి అభ్యతరమూ చెప్పకపోగా వారిపై అనుమానమూ రాలేదు. బాలికకు కొద్ది నెలలుగా రుతుక్రమం ఆగిపోవటంతో ఆ బాలుడికి చెప్పింది.
ఆసుపత్రికి తీసుకెళ్లగా చూపించగా ఏడు నెలల గర్భం అని చెప్పారు. ఇంట్లో తెలిస్తే ఊళ్లో గొడవ అవుతుందని భయపడిపోయిన వారు ఈనెల 22న రైల్లో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.

అక్కడి వారు దివ్యదిశ చైల్డ్‌లైన్‌ ప్రతినిధుల కంటపడ్డారు. వారిని అనుమానించి ఆరా తీయట వల్ల అసలు విషయం బయటపడింది.
ఆ ఇద్దరి తల్లిదండ్రులకు చైల్డ్ లైన్ ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. తొలుత బాలుడి కుటుంబసభ్యులు రావడంతో అతన్ని అప్పగించారు.
తదనంతరం వచ్చిన బాలిక కుటుంబ సభ్యులు జీఆర్పీలో ఫిర్యాదు చేయడం వల్ల యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
కేసును బిహార్‌కు బదిలీ చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన యువతి

Exit mobile version