Site icon Prime9

Road Accident: లారీని ఢీ కొట్టిన టాటా మ్యాజిక్.. నలుగురు దుర్మరణం

six-died-and-15-injured-after-truck-collaided-with-rtc-bus-in-ups-bahraich

six-died-and-15-injured-after-truck-collaided-with-rtc-bus-in-ups-bahraich

Road Accident: ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లిలో విషాదం నెలకొనింది. 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

బుధవారం తెల్లవారుజామున గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లాలోని వివిధ గ్రామాలు, మండలాలకు చెందిన 13 మంది టాటా మ్యాజిక్‌ వాహనంలో అనకాపల్లి జిల్లా కశింకోటలోని పరమటమ్మ తల్లి ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మల్లేపల్లి గ్రామశివారులో టాటా మ్యాజిక్‌ వాహనం అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్ సహా నలుగురు దుర్మరణం చెందారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులను నల్లజర్లకు చెందిన టాటా మ్యాజిక్‌ డ్రైవర్‌ కొండా (38), నారాయణరానికి చెందిన ప్రసాద్‌ (48), ఉండ్రాజరానికి చెందిన మహేశ్‌ (28) నల్లజర్లకు చెందిన మంగ (36)గా పోలీసులు గుర్తించారు. వరంగల్‌కు చెందిన పార్వతి (35), గుణంపల్లికు చెందిన మణికంఠ (25) పరిస్థితి విషమంగా ఉందని గండేపల్లి ఎస్సై గణేష్‌ కుమార్‌ తెలిపారు.

ఇదీ చదవండి: చిత్తూరులో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

Exit mobile version