Site icon Prime9

YS Sharmila: కారుతో సహా షర్మిలను క్రేన్ తో ఎత్తుకెళ్లిన పోలీసులు

ysrtp-chief-ys-sharmila-arrest-hyderabad-telangana

ysrtp-chief-ys-sharmila-arrest-hyderabad-telangana

YS Sharmila: ప్రగతిభవన్‌ వద్ద హైడ్రామా నెలకొంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న షర్మిల కాన్వాయ్ పై తెరాస కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ ధ్వంసమైన కారులో భారీ కాన్వాయ్‌తో నేడు ప్రగతిభవన్ ముట్టడికి షర్మిల యత్నించారు. దానితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు సోమాజిగూడ వద్ద షర్మిలను అడ్డుకుని అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. కారులో నుంచి దిగేందుకు షర్మిల నిరాకరించారు. డోర్‌ లాక్‌ చేసుకుని కారు లోపలే ఉండిపోయారు. దానితో సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు షర్మిల ఉన్న కారును మినీక్రేన్‌ సాయంతో లిఫ్ట్ చేసి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ బలవంతంగా కారు డోర్లు తెరిచారు. అనంతరం షర్మిలను పీఎస్‌ లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు పోలీస్‌స్టేషన్‌కు భారీగా వైఎస్సార్టీపీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: వైఎస్ షర్మిల బస్సుకు నిప్పు పెట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు

Exit mobile version