Site icon Prime9

MLC Kavitha: భయపడే ప్రసక్తే లేదు.. జైల్లో పెడతారా పెట్టుకోండి- ఎమ్మెల్సీ కవిత

mlc-kavitha-press-meet ED case in delhi liquor scam

mlc-kavitha-press-meet ED case in delhi liquor scam

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రోజురోజుకు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు సీరియస్ గా తీసుకున్న ఈడీ విచారణను వేగవంతం చేస్తోంది. ఈ కేసులో మరో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఈ కేసు విషయంలో కాసేపటి క్రితం కవిత మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీపైనా ఆమె విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతోందని ఈ ఎనిమిదేళ్ల కాలంలో తొమ్మిది రాష్ట్రాల్లో ఈడీ దాడులు జరిగాయని.. తద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టి, అడ్డదారిలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని కవిత విమర్శించారు.

ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు రావడానికి ఒక ఏడాది ముందు ఆ రాష్ట్రానికి మోదీ కంటే ముందు ఈడీ వెళ్తుండటాన్ని మనం గమనిస్తున్నామని కవిత ఆరోపించారు. మోదీ పాలనలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందని ఆమె అన్నారు.

తన మీద కానీ, టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కానీ ఈడీ దాడులు జరగడం సహజమేనని కవిత పేర్కొన్నారు. మీడియాకు ముందే లీకులిస్తూ రాష్ట్రంలో అలజడి రేపాలనుకుంటున్నారని బీజేపీపై మండిపడ్డారు. వాటికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి బీజేపీ అత్యంత చైతన్యవంతమైన తెలంగాణలో అధికారంలోకి రావాలనుకోవడం జరిగే పని కాదని ఆమె ఎద్దేవా చేశారు.
జైల్లో పెడతామంటే పెట్టుకోండి అని కేసులకు భయపడే ప్రసక్తే లేదని కవిత అన్నారు. ఈడీ విచారణకు తాను సహకరిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: గుజరాత్ తొలి విడత పోలింగ్ ప్రారంభం

Exit mobile version