Chandrababu: కందుకూరు చంద్రబాబు సభలో తొక్కిసలాట.. 5 మంది మృతి పలువురికి గాయాలు

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభ నిర్వహించారు. కాగా ఈ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Chandrababu: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభ నిర్వహించారు. కాగా ఈ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన జనంతో తొక్కిసలాట ఏర్పడింది. కాలువలో పడి 5 గురు మరణించినట్లు సమాచారం. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

పామూరులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద చంద్రబాబు రోడ్‌షో నిర్వహిస్తూ ప్రసంగిస్తుండగా.. తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలోనే సభకు వచ్చిన తెదేపా కార్యకర్తల మధ్య తొక్కిసలాట జరిగి పక్కనే ఉన్న కాలువలో పడడంతో ఐదుగురు మరణించినట్టు తెలుస్తోంది. మరికొందరికి గాయాలయ్యాయి. నలుగురిపైగా ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. మృతుల్ని గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా మృతుల కుటుంబాల ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. చంద్రబాబు సభను రద్దు చేసి మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

ఇదీ చదవండి:  ఒకప్పుడు నో ఎంట్రీ.. ఇప్పుడు వెల్‌కమ్ తెలంగాణలో చంద్రబాబుపై కేసీఆర్ వ్యూహం ఎందుకు మారింది?