Site icon Prime9

Ap News: వైద్యుల నిర్లక్ష్యం.. శిశువు బొడ్డుతాడుకు బదులుగా చిటికెన వేలు కత్తిరించిన వైనం

the babys little finger was amputated instead of the umbilical cord

the babys little finger was amputated instead of the umbilical cord

Ap News: ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. పుట్టిన బిడ్డకు బొడ్డుతాడు కట్ చెయ్యాల్సింది పోయి చిన్నారి చిటికెన వేలుని కత్తించారు ఆ నిర్లక్ష్యపు వైద్యులు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లాలోని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది.

మాచర్ల పట్టణంలోని 31వ వార్డుకు చెందిన స్వరూప అనే గర్భవతి ప్రసవం కోసం గత నెల 30న మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. కాగా స్వరూపకి పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె స్పృహలోకి రాకముందే శిశువు బొడ్డుతాడు కట్ చెయ్యడానికి బదులు చిన్నారి చిటికెన వేలును కట్ చేశారు. దానిని వెంటనే గ్రహించిన అక్కడి వైద్యులు చిన్నారికి చేతికి కట్టుకట్టి తల్లీబిడ్డను గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు శిశువు వేలు చివర్లో తెగిందని, శస్త్రచికిత్స చేసి అతికిస్తామని, బాబు ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నాడని తెలిపారు.

విషయం తెలుసుకున్న స్వరూప బంధువులు ప్రభుత్వాసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీనికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కాగా ఈ ఘటనకు బాధ్యులైన వారిని విధులనుంచి తొలగించినట్లు వైద్య విధాన పరిషత్‌ డీసీ రంగారావు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన ఇద్దరు సీఐలు..!

 

Exit mobile version