Site icon Prime9

Chandrababu: “ఇదేం కర్మ” కార్యక్రమాన్ని చేపట్టనున్న చంద్రబాబు

chandrababu

chandrababu

Chandrababu: వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తాజాగా మరో కార్యక్రమానికి తెలుగుదేశం శ్రీకారం చుట్టబోతోంది.

‘ఇదేం కర్మ’ అనే కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించనున్నారు. ఈరోజు జరగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి పోటీగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలను అక్రమాలను ప్రజలకు వివరించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను, కష్టాలను తెలుసుకుంటారు. 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: పేటీఎమ్ బ్యాచ్ నాటకాలు ఆపకపోతే తోలు తీస్తాను.. చంద్రబాబు నాయుడు

Exit mobile version